పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించిన మంచు మనోజ్ – భూమా మౌనికలు ఇటీవలే శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ..తాను ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నానని.. మౌనికకు రాజకీయాలపై ఆసక్తి ఉందంటే అందుకు తాను సహకరిస్తానని మనోజ్ వ్యాఖ్యానించడంతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది.
ఇప్పటికే భూమా మౌనిక సోదరి భూమా అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆమె గతంలో మంత్రిగా కూడా పని చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఆమె పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే భూమా మౌనిక కూడా రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని..అందుకే మౌనికకు రాజకీయాలపై ఆసక్తి ఉందంటే తాను సహకరిస్తానని మనోజ్ చెప్పి ఉంటారని అంటున్నారు.
టీడీపీ నుంచి అక్కా చెల్లెళ్ళకు ఇద్దరికీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తారు. దాంతో మౌనిక వైసీపీ నుంచి టికెట్ ఇస్తామని హామీ ఇస్తే ఫ్యాన్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమె మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలోనే ఉన్నారు. అలాగే మనోజ్ తండ్రి , మౌనిక మామ మోహన్ బాబు కూడా వైసీపీలో కొనసాగుతున్నారు. దీంతో ఆమె కూడా వైసీపీ నుంచి ఆఫర్ వస్తే వైసీపీలో చేరవచ్సునని చెబుతున్నారు.
ఇక మౌనికారెడ్డి రాజకీయంగా ఉత్సాహం చూపిస్తే కనుక చిత్తూరు జిల్లా చంద్రగిరి టికెట్ ఇవ్వడానికి వైసీపీ హై కమాండ్ రెడీగా ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. ఆయన రెండు సార్లు గెలిచి ఉన్నారు. మౌనికారెడ్డి కనుక ఓకే అంటే కనుక ఈ టికెట్ ఆమెకు ఇచ్చి చెవిరెడ్డికి తిరుపతికి పంపిస్తారు అని అంటున్నారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని టీటీడీ చైర్మన్ గా చేస్తారు అని అంటున్నారు.
చిత్తూర్ లో మంచు ఫ్యామిలీకి విద్యా సంస్థలు ఉన్నాయి. స్థానికంగా మంచి పరిచయాలు కూడా ఉండటంతో..మంచువారి కోడలు భూమా మౌనికను చిత్తూర్ జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేయించే అవకాశాన్ని వైసీపీ పరిశీలిస్తుండోచ్చునని విశ్లేషిస్తున్నారు.
Also Read : వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ పై బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పోటీ..?