సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోదా చిత్రం శుక్రవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ మీరూ ఓ లుక్కేయండి
కథ
తల్లిదండ్రులను కోల్పోయిన యశోదా ( సమంత) తన సోదరి బృంద ( ప్రీతీ అస్రాని) ని సొంత బిడ్డలా చూసుకుంటుంది. చెల్లిని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది. తనే లోకంగా బతుకుతుండగా ప్రీతీకి అనారోగ్య సమస్య తలెత్తుతుంది. ఆపరేషన్ చేస్తేనే ఆమె బతుకుందని ఇందుకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని వైద్యుల సలహా మేరకు సమంత డబ్బును సంపాదించడంపై దృష్టి పెడుతోంది. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని టెన్షన్ పడుతుంది. కాని ఎదో ఓ రకంగా డబ్బు దొరికే అవకాశం సమంతను చేరుతుంది. సోదరిని రక్షించుకోవడానికి అవసరమయ్యే డబ్బు కోసం అద్దె గర్భం ద్వారా బిడ్డను కనేందుకు సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మిస్ ఇండియా అనుమానాస్పదంగా మరణిస్తుంది.
సరోగసికి రెడీ అయిన యశోదాకు ఆసుపపత్రీలో ఎదురైనా సమస్యలు ఏంటి..? యశోదాతోపాటు ఫెసిలిటీలోనున్న లీలా( దివ్య శ్రీపాద) కు జరిగిన అన్యాయం పట్ల యశోదా ఎలా రియాక్ట్ అయింది..? ఆమెకు వ్యతిరేకంగా మధుబాల ( వరలక్ష్మి శరత్ కుమార్ ), డాక్టర్లు ఎందుకు వ్యవహరించారు..? అద్దె గర్భానికి సెంట్రల్ మినిస్టర్ ( రావు రమేష్ ) కున్న సంబంధం ఏంటి..? మిస్ ఇండియా మరణంపై పోలీసుల దర్యాప్తు ఎలా కొనసాగింది..? అసలు యశోదాకు, ఈ మిస్ ఇండియా మరణంకు సంబంధం ఏంటి..? విచారణ కోసం యశోదాను పోలీసులు ఎందుకు సంప్రదించారు అనేది సినిమా లైన్.
మొదటి నుంచి సినిమా కథ ఉత్కంటను రేకెత్తించేలా చేయడంలో దర్శకుడు ఫుల్ సక్సెస్ అయ్యాడు. ఫస్టాప్ లో క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ సమయం తినేసారనే అనుభూతి కల్గుతుంది. అయినప్పటికీ సినిమా కథను ఆసక్తికరంగా మార్చడంలో దర్శకులు ఫుల్ మార్క్స్ వేయించుకుంటారు. ఫస్టాప్ కొంత స్లో నేరేషన్ ఉన్నప్పటికీ సమంత యాక్షన్స్, సెంటిమెంట్ తో సినిమాను మరో స్టేజ్ తీసుకెళ్తుంది. సిస్టర్ సెంటిమెంట్ తో సమంత అక్కడక్కడ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. యాక్షన్స్ , సమంత నటన వైవిధ్యంతో సాగిన ఈ సినిమాను చూసిన సగటు ప్రేక్షకుడికి పూర్తిగా సంతృప్తి మిగిల్చేమూవీ యశోదా.
ఈ చిత్రం పూర్తిగా వన్ ఉమెన్ షో గా అనిపిస్తుంది. సమంత కెరీర్ లో ది బెస్ట్ గా చిత్రంగా యశోదా నిలుస్తోందని చెప్పొచ్చు.