తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వారు కూడా బీజేపీకి విరాళాలు కట్టబెడుతున్నారు. గత ఏడాది ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ నుంచి బీజేపీకి ఎలక్టోరల్ ఫండ్ ద్వారా విరాళాలు ఇచ్చిన వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. యశోదా ఆసుపత్రి బీజేపీకి ఏకంగా రూ. పది కోట్ల విరాళాన్ని ఇచ్చినట్లు పేర్కొంది.
యశోదా ఆసుపత్రిపై కేసీఆర్ అపారమైన ప్రేమ కనబరుస్తారు. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా యశోదాకే వెళ్తారు. కేసీఆర్ కుటుంబీకులకు ఈ ఆసుపత్రితో మంచి అనుబంధం ఉంటుంది. అలాంటి ఆసుపత్రి మేనేజ్ మెంట్ బీజేపీకి ఏకంగా పదికోట్ల విరాళాన్ని కట్టబెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
సొంత పార్టీ నేతలు కూడా ఆ స్థాయిలో బీజేపీకి విరాళం ఇవ్వలేదు. విశాఖ ఇండస్ట్రీస్ అధినేత జి. వివేక్ మూడు కోట్లు విరాళం ఇచ్చారు. మిగిలిన వాళ్ళు లక్షల్లోనే విరాళం ఇచ్చుకున్నారు. టీఆర్ఎస్ అధినేతతో సఖ్యత మెయింటేన్ చేసే యశోదా ఆసుపత్రి బీజేపీకి విరాళం ఇవ్వడం చర్చనీయాంశం అయింది.
Also Read : రేవంత్ లాజిక్ తో కేసీఆర్ పరేషాన్..!
గతంలో యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు జరిగాయి. ఆ తరువాత కొన్నాళ్ళకే ఈ విరాళం ఇచ్చిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీలు ఈసీకి ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ .. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే సౌకర్యం ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలిస్తే.. వివరాలను రహస్యంగా ఉంచుతారు. ట్రస్టుల ద్వారా ఇస్తే టాక్స్ నుంచి వెసులుబాటు ఉంటుంది.
Also Read : కేసీఆర్ రాజ్యంలో మాయమైపోతున్న తెలంగాణం
దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో డెబ్బై ఐదు శాతం భారతీయ జనతా పార్టీకే వెళ్తున్నాయి. మిగతా 25శాతం అన్ని పార్టీలు పంచుకుంటాయి. ప్రాంతీయ పార్టీల కన్నా అతి తక్కువగా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు వస్తున్నాయి.