యశస్వి కొండెపూడి..సంగీత ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. సరిగమప సింగింగ్ షో లో జాను మూవీలోని లైఫ్ ఆఫ్ రామ్ అనే సాంగ్ పాడి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ షో లో సింగింగ్ టైటిల్ ను కూడా గెలుచుకున్నాడు. యూట్యూబ్ లో యశస్వి సాంగ్ ట్రెండింగ్ లో నిలిచింది. సినిమాలోని పాట కంటే కూడా యశస్వి సాంగ్ అద్భుతంగాను పాడాడని చెప్పుకొచ్చారు. సరిగమప సింగింగ్ కు జడ్జిలుగా వ్యవహరించిన వారు కూడా యశస్వికి మంచి ఫ్యూచర్ ఉందని ప్రోత్సహించారు.
ఒక్క సాంగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు యశస్వి. సినిమాల్లో కూడా యశస్వికి అవకాశాలు వచ్చాయి. పలు ఈవెంట్స్ లో సిగ్గు పడుతూ కనిపించే ఈ యంగ్ సింగర్ మాట్లాడటానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడు. అలాంటి యశస్వి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తనది కాని స్వచ్చంద సంస్థను తానే నడుపుతున్నానని…సమాజ ఉద్దరకుడిగా చెప్పుకున్నాడని నవసేన ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా కౌసర్ ఆరోపించింది. సెలబ్రీటి హోదాతో చీటింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తోంది.
ఇంతకీ విషయం ఏంటంటే..ఇటీవల సింగర్ యశస్వి ఓ షో లో పాల్గొన్నారు. అందులో అతను మాట్లాడుతూ నవసేన అనే స్వచ్చంద సంస్థ ద్వారా 50నుంచి 60మందిని ఉచితంగా చదివిస్తున్నానని చెప్పుకున్నాడని కౌసర్ చెబుతోంది. ఇది నిజం కాదని.. ఆ సంస్థను తాను నడిపిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.
గత ఐదేళ్ళుగా నవసేన అనే స్వచ్చంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. 56మంది అనాధ పిల్లలను చదివిస్తున్నాను. అయితే.. సింగిల్ షో లో ఓట్లు రాబట్టుకునేందుకు యశస్వి ఈ ట్రిక్ మెయింటేన్ చేస్తున్నాడని ఆమె ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంపై యశస్వితో చర్చించాను. క్షమాపణలు చెప్పాలని కూడా కోరాను. కానీ అతడు పట్టించుకోలేదు అని కౌసర్ తెలిపింది. నేను చేస్తోన్న సేవను అతని ఖాతాలో వేసుకోవడం సరైనదేనా..? ఇది పద్ధతి కాదు కదా అంటూ కౌసర్ చెప్పుకొచ్చింది.