క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడింది. దీనిని ఒక వార్తలా కాకుండా, ఒక డాక్యుమెంట్ సీరియల్ లాగా తీశారు. ‘క్యాచ్ అవుట్’ పేరుతో రాబోతున్న ఈ డాక్యుమెంట్ సీరియల్ హక్కలను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. దీని ట్రైలర్ నిన్న విడుదల కాగానే వైరల్ గా మారింది. అయితే ఈ కుంభకోణం ఎవరు చేశారు, ఏ దేశం వాళ్ళు చేశారు అనే విషయం ఇంకా బయటపెట్టలేదు. అప్పుడే దీనిమీద పెద్ద గాలిదుమారమే చెలరేగుతోంది. క్రికెట్ అభిమానులలో నరాలు తెగిపోపోయే ఉత్కంట మొదలయ్యింది. ఆట గళ్ళు కూడా భయపడుతున్నారు.
అప్పుడే పాకిస్తాన్ లో ఓ భూకంపం వచ్చిన ప్రకంపనలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ లల్లో ఎక్కువగా పాకిస్తాన్ క్రీడాకారులే ఉన్నారు కాబట్టి. మొదటినుంచి పాకిస్తాన్ క్రీడా కారుల మీద అంతర్జాతీయ క్రికెట్ సంఘాలు డేగా కన్నేసి పెడతాయి. వాళ్ళకు డ్రగ్స్ పరీక్షలు తప్పక నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇండియాతో జరిగే మ్యాచ్ లకు మూడు నెలల ముందునుంచే ముందు నుంచి ఈ హడావాడు మొదలవుతుంది. వాళ్ళ సెల్ ఫోన్లు ట్యాబ్ చేస్తారు. వాళ్ళ ప్రతి కదలిక మీద నిఘా పెడతారు. వాళ్ళను ఎవరెవరు కలుస్తున్నారో వివరాలు సేకరిస్తారు.
రెండో స్టానంలో వెస్ట్ ఇండీస్, మూడో స్టానంలో ఇండియా ఉంది. హైదరాబాద్ కి చెందిన మొహమ్మద్ హాజరుద్దిన్ నుంచి ఈ ప్రవాహం మొదలయ్యింది. ఇందులో చిక్కిన వాళ్లు, వేటు పడినవాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ప్రపంచ కప్లల్లో ఇవి ఎక్కువగా జరుగుతాయి. మన దేశానికి చెందిన ఎస్. శ్రిశాంక్, అజయ్ జడేజా లాంటివాళ్ళు ఇందులో కూడా స్టార్లు. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిన ఇండియన్ ఆటగాళ్ళు చాలామంది నేటికీ ఉన్నారు.
సామాన్యంగా టెస్ట్ మ్యాచ్ లల్లో మ్యాచ్ ఫిక్సింగ్ లు తక్కువ. కానీ ఓడిఐ లో మాత్రం ఎక్కువనే చెప్పాలి. కానీ టి 20 – 20 మ్యాచ్ లల్లో మాత్రం ఎక్కువనే చెప్పాలి. ఇప్పుడు ఐ పి ఎల్ లో కూడా ఇది మొదలయ్యింది. అయితే ‘క్యాచ్ అవుట్’ అనేది టెస్ట్ మ్యాచ్ మీద తీసారా, ఓడిఐ మీద తీసారా, 20 -20 మీద తీసారా లేక ఐ పి ఎల్ మీద తీసారా అన్నది రివీల్ చేయలేదు. అదే గొప్ప సుస్పెన్స్.
అయితే ‘క్యాచ్ అవుట్’ డాక్యుమెంట్ సీరియల్ని అప్పాలని కొందరు పెద్దలు నెట్ నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం మీద ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. ఇంతకు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడిన వాళ్ళకు అప్పుడే భయం మొదలయ్యింది. ఇప్పటివరకు మనకు తెలియని ఆటగాళ్ళు ఇప్పుడు బయటికి రాబోతున్నారు. చూడాలి ఎవరా స్టార్ ప్లేయర్లు.