వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ త్వరలో రద్దు కానుంది. దీని స్టానంలో వందే భారత్ సూపర్ ఫాస్ట్ రైలు రాబోతోంది అని కేంద్ర రైల్వే శాఖ ఓ ప్రతిపాదన తెస్తోంది. ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య పరుగులు పెట్టనుంది. అయితే ఈ రైల్ ఎన్ని స్టేషన్ లల్లో ఆగుతోందో, ఎన్ని గంటలు సమయం ఆదా అవుతోందో, దీని ధర ఎంతో ఇంకా ప్రకటించలేదు.
ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాకాకు ‘మొదటి వందే భారత్’ రైల్ ని ప్రవేశ పెట్టారు. ఇది విజయవంతం అయ్యింది. ప్రయాణికుల సమయం చాలా ఆదా అవ్వడంతో ఇది నిండిపోతోంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు ‘సికింద్రాబాద్ – తిరుపత’ మధ్య వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ స్టానంలో వందే భారత్ రైల్ ని ప్రవేశ పెడుతోంది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పుడు ఈ ‘రెండో వందే భారత్’ కూడా విజయవంతం అయ్యితే మరికొన్ని వందే భారత్ సూపర్ ఫాస్ట్ రైళ్ళను ప్రవేశ పెట్టనుంది కేంద్రం. అందులో ముందువరుసలో సికింద్రాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లే ‘తెలంగాణ ఎక్స్ ప్రెస్’, హైదరాబాద్ నుంచి ముంబాయికి వెళ్లే ‘ముంబై ఎక్స్ ప్రెస్’, సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లే ‘చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్ళను రద్దుచేసి, వాటి స్టానంలో వందే భారత్ రైళ్ళు ప్రవేశపెట్టే యోచలావు కేంద్రం ఉన్నది.