డ్వాక్రా మహిళల ఉత్పత్తులంటే లోకల్ ప్రోడక్ట్ అనే చిన్న చూపు ఉంది. నాణ్యత ఎంత బాగున్నా దానికి బ్రాండ్ ఇమేజ్ లేకపోవడంతో ఆ ఉత్పత్తులు గ్రామాల సంతలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడా కష్టాలు తీరుస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం అద్బుతమైన పతకం ప్రవేశపెట్టింది.
ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పేరుతో ఒక లోగోతో రాబోతోంది. ఇకపై డ్వాక్రా మహిళల ఉత్పత్తులు చేసే అన్ని రకాల వస్తువలకు ఈ బ్రాండ్ పెట్టనున్నారు. అంటే ఇకపై ఇది ఐ ఎస్ ఐ బ్రాండ్ లాంటిది. నాణ్యతకు, మన్నికకు, ధరకు ఇది ఒక అధికారిక స్టాంప్ లాంటిది. ఈ భాద్యతను సెర్ప్ (పేదరిక నిర్మూలనా సంస్థ) చేపట్టనుంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో చెప్పారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన వివరాలను బట్టి ఇకపై వస్తువులు ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబులింగ్ తో అంతర్జాతీయ వ్యాపారంతో పోటీ పడనున్నాయి. ఇప్పటికే ఆయన ఫ్లిప్ కార్ట్ సంస్థతో ఒప్పందం జరిపారు. అమెజాన్ వంటి ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు చేసేందుకు అయన కృషి చేస్తున్నారు. ఏ వస్తువులకైతే అంతర్జాతీయ డిమాండ్ ఉందో ఆ వస్తువుల పైనే ద్యాస పెట్టలని ఆయన సంభందిత అధికారులను ఆదేశించారు.