చైనాలో నమోదు అవుతోన్న కరోనా కేసులు ప్రపంచ దేశాలను ఆందోళన గురి చేస్తున్నాయి. రోజుకు పది లక్షల కేసులు నమోదు అవుతున్నట్లు లండన్ కు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. ఇది పొరుగు దేశాలను భయం గుప్పిట్లోకి నెడుతోంది. ముఖ్యంగా ఇండియాలో కేసులు పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు అప్పుడే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ లాక్ డౌన్ వంటి కఠిన ఆంక్షలు విధిస్తారా..? అని చర్చించుకుంటున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ భయం స్టాక్ మార్కెట్లను పతనం వైపు నడిపిస్తోంది.
ఇప్పుడు దేశంలో భరోసా కంటే భయమే ఎక్కువ వేగంగా వ్యాపిస్తోంది. కొత్త వేరియంట్ భయంతో జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంది. లాక్ డౌన్ పునరావృతం అవుతుందన్న భయాలు అన్ని రంగాలను కుదిపేస్తున్నాయి.2019లో ఆర్ధిక వ్యవస్థ ఎలా చితికిపోయిందో ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మార్కెట్ల పతనం అప్పుడే ప్రారంభమైపోయింది. వారం రోజులుగా పతనం అవుతోన్న స్టాక్ మార్కెట్లు ఈ వారంతో పరాకాష్టకు తాకేసాయి. శుక్రవారం ఒక్కరోజే 8కోట్ల సంపద హుష్ కాక్ అయింది. ప్రస్తుతం ప్రజారోగ్యాల బెంగ లేదు కాని లేనిపోని భయాల నడుమ కూలిపోతున్న వ్యవస్థలే దేశాన్ని ఊబిలోకి దించేస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతుండటంతో దీన్నసలు నాలుగో అలగా పరిగనించాలా వద్దా..? ప్రాణ నష్టాన్ని ఏ స్థాయిలో ఊహించుకోవచ్చు. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించాలా..? వద్దా అనేది ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది.
Also Read : కోరలు చాచిన కరోనా – ఒక్కరోజే పది లక్షల కేసులు
అయితే, మనకు చైనాకు పొంతనే లేదు. అలాగే 2019, 2022కి పోలిక ఉండకపోవచ్చు . అలాగని అలర్ట్ గా లేకపోతే మహమ్మారి ప్రభావానికి తట్టుకొని నిలబడలేం. 2019 డిసెంబర్ , 2022 డిసెంబర్. అప్పుడు చైనానే. ఇప్పుడు చైనానే. ఇప్పుడు దేశమంతా డిసెంబర్ భయం. 2019 లో చైనా ల్యాబ్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా జన జీవితాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు కూడా అదే డిసెంబర్. అదే చైనా. అదే ఫియర్. అదే కరోనా. రూపు మార్చుకొని BF7 గా భయం పుట్టిస్తోంది.
మొదటి విడతలో తెలియని తనంతో కరోనాను జనాలు తేలికగా తీసుకున్నారు. సెకండ్ వేవ్ లో తెలిసి, తెలిసి చావును ఆహ్వానించారు. మూడో వేవ్ వచ్చేసరికి రెండు విడతల అనుభవం పనిచేసింది. ఇప్పుడు ఫోర్త్ వేవ్ ఎలా ఉండబోతోందన్నది ప్రశ్న. జీరో కోవిడ్ విధానం ఎత్తేసి చేతులారా ఉరికంబం ఎక్కినట్లుంది చైనా పరిస్థితి. ఆ దేశంలో లక్షల్లో కేసులు. వేలల్లో మరణాలు. గత ఇరవై రోజుల్లో 3.7కోట్ల మందికి కొత్త వేరియంట్ సోకినట్లు చైనా హెల్త్ కమిషన్ అంగీకరించింది.మరి పొరుగు దేశాల్లో పరిస్థితి ఏంటన్ని తెలాల్సి ఉంది.
Also Read : కరోనా డేంజర్ బెల్స్ – రాష్ట్రాలకు కేంద్రం బిగ్ అలర్ట్
చైనా, జపాన్, యూఎస్ ఇలా అన్ని దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అప్పుడే ఇండియాకు వచ్చేసింది. మనలో ఒక్కరికి సోకితే అదే పదిమందికి అంటిస్తుంది. కాని ఇదీ కొత్తగా పుట్టిన వేరియంట్ కాదు. 2021ఫిబ్రవరి నుంచే 91 దేశాల్లో కనిపించిందని, దాని తీవ్రతను గమనించి ఇప్పుడు దానికి BF7 నామకరణం చేసినట్లు చెబుతున్నారు వైరాలజిస్టులు. అంటే రెండేళ్ళ మన మధ్యే ఉండి ఇప్పుడు తలెత్తి చూస్తోన్న వేరియంట్ అనేది క్లియర్. పైగా కోవిడ్ ను ఎదుర్కోవడంలో చైనాకు మిగతా దేశాలకు చాలా తేడాలున్నాయి. థర్డ్ వేవ్ లో అన్ని దేశాల్లో లక్షలాది కేసులు నమోదు అయితే చైనా మాత్రం లాక్ డౌన్ లేదంటూ జీరో కోవిడ్ అంటూ ఎంజాయ్ చేసింది. సీక్రెట్ గా వ్యాక్సిన్ తయారు చేసుకొని సేవ అయినట్లు డ్రాగన్ కంట్రీపై డౌట్లు ఉన్నాయి.
2021ఏప్రిల్ లో సెకండ్ వేవ్ ముంచుకొచ్చినప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంది చైనా. అదే సమయంలో ఇండియాలో భయపడినంత నష్టమేమి జరగలేదు. ఇప్పుడు BF7వేరియంట్ విషయంలోనూ మన దగ్గర అదే ఆశాభావం కనిపిస్తోంది. అందుకే ఇది విలయమే కాని ప్రాణాంతకం కాదు ప్యానిక్ అవ్వాల్సిన పనిలేదని, ఇదివరకులా ప్రాణవాయువు కోసం పరుగులు పెట్టాల్సిన అగత్యం రాదనీ ఓ భరోసా అయితే కనిపిస్తోంది. గత మూడు వేవ్ లో నేర్చుకున్న గుణపాఠాలు ఇండియన్లకు భాగా పని కొస్తున్నాయి. దాంతో ఫోర్త్ వేవ్ ను డీకొట్టడానికి రెడీ అయ్యారు. కరోనా వ్యాక్సిన్ , బూస్టర్ డోస్ వేసుకోవడంతో 95శాతం రిస్క్ నుంచి తప్పించుకున్నట్లేనని చెబుతున్నారు.
Also Read : బిగ్ అలర్ట్ – ఇండియాలో పెరుగుతోన్న కరోనా కేసులు
కాబట్టి చైనాలో తీవ్ర ప్రభావం చూపుతోన్నBF7 మన దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని, లాక్ డౌన్ విధించాల్సిన పరిస్తితులేవి ఉండకపోవచ్చునని అర్థం అవుతోంది.