క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న పొద్దునలేస్తే బహుజనవాదం పల్లవి వినిపిస్తాడు. బహుజన రాజ్యాధికారం అంటూ తూటలాంటి తన మాటలతో అందర్నీ ఆలోచింపజేస్తాడు. అయితే, గతంలో బీసీలకు రాజాకీయాధికారంలో సముచితమైన స్థానం కల్పించిన టీడీపీతో ఆయన కలిసే నడిచే అవకాముందన్న ప్రచారం తాజాగా జోరుగా జరుగుతోంది.
టీడీపీ తెలంగాణలో బలపడాలని అనుకుంటోంది. మళ్ళీ పునర్వైభవం కోసం తహతహలాడుతోంది. తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడిగా బక్కని నరసింహులును తప్పించి ఆయన స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ కు బాధ్యతలు అప్పగించింది.పార్టీ బలోపేతం కోసం ఆయన దూకుడు పెంచుతున్నారు. ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో మరికొన్ని జిల్లాలో సభలు ప్లాన్ చేస్తున్నారు. పార్టీని వీడి వెళ్ళిన నేతలను తిరిగి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు… తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే యువ నేతలను కూడా పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న ఆశాదీపంలా కనిపించారు.
ఆయనతో కలిసి పని చేస్తే పార్టీ బలోపేతం అవుతుందని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం తీన్మార్ మల్లన్నతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సుదీర్ఘంగా సమావేశమై తెలంగాణలో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు నాయుడు కూడా మల్లన్నతో ఫోన్‌లో మాట్లాడి తెలంగాణలో టీడీపీతో కలిసి పనిచేయాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీడీపీలోకి మల్లన్నను సైకిల్ సారధి ఆహ్వానించే ఉంటారు.
ఒకే లక్ష్యం కోసం పని చేస్తున్నప్పుడు వేర్వేరుగా సాగడం కంటే.. ఒకే దారిలో కలిసి విజయవంతం అవుదామని వారి మధ్య చర్చ జరిగి ఉండొచ్చు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను బీసీలకు ఇచ్చేందుకు టీడీపీ రెడీగాఉంది. బహుజనవాద లక్ష్యంతో మల్లన్న..అదే లక్ష్యంతో రాజకీయాధికారంలో బీసీలకు సముచితమైన స్థానం కల్పించిన టీడీపీకి మద్దతు ఇవ్వడమే కాదు.. అవసరమైతే పార్టీలో చేరే అవకాశం కూడా ఉందని టాక్.
Also Read : బీజేపీలోకి పొంగులేటి – కాంగ్రెస్ లోకి తుమ్మల..?