తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు హైకోర్టు మంగళవారం గట్టి షాక్ ఇచ్చింది. ఆయన తెలంగాణలో సీఎస్ కొనసాగేందుకు అనర్హుడని తీర్పు ఇచ్చింది. ఏపీ క్యాడర్ కు చెందిన సోమేశ్ కుమార్ గురువారం ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇందుకోసం మూడు నెలల సమయం కావాలని కోరినప్పటికీ హైకోర్టు నిరాకరించింది.
గురువారం ఏపీలో రిపోర్ట్ చేయాలనీ డీవోపీటీ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆయన సీఎస్ పదవిని అధికారికంగా కోల్పోయినట్లే. దాంతో వెంటనే సోమేశ్ కుమార్ ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశమైన ప్రయోజనం లేకుండా పోయింది. సోమేశ్ కుమార్ ను ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కొత్త సీఎస్ ను నియమించుకోవాల్సి ఉంది.
తెలంగాణలో సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో అనే విమర్శలు ఉన్నాయి. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ధరణి అంశం ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేస్తోంది. ధరణిని ఎత్తివేయాలని కోరుతున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన పట్టించుకోలేదు. కేసీఆర్ కు విధేయుడిగా ఉండటంతో ఆయన్ను పదవి కాలం పూర్తయ్యే వరకు సీఎస్ గా కొనసాగించాలనుకున్నారు కేసీఆర్.
సోమేశ్ కుమార్ సీఎస్ గా ఉన్నప్పుడే కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళాలనుకున్నారు. కాని హైకోర్టు తీర్పుతో అది సాధ్యం కాకుండా పోయింది. కొత్త సీఎస్ తో ఎన్నికలకు వెళ్ళాల్సిన పరిస్థితి.ఇకపొతె.. సోమేశ్ కుమార్ నియామకంపై రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు.ఏపీ క్యాడర్ కు చెందిన అధికారిని తెలంగాణలో ఎలా నియమిస్తారని సోమేశ్ ను సీఎస్ గా నియమించిన రోజే రేవంత్ ప్రశ్నించారు. నాడు రేవంత్ ఏ వాదననైతే వినిపించాడో హైకోర్టు కూడా నిన్న అదే వాదనను వినిపించింది.
సోమేశ్ కుమార్ రెండుసార్లు లాంగ్ లీవ్ తీసుకొని ప్రైవేట్ సంస్థలో పని చేశారు. తనకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు సర్వీసులోకి వచ్చారు. ఆయనకంటే ఎనిమిది మంది సీనియర్లు ఉన్నప్పటికీ వారిని పక్కనపెట్టేసి కేసీఆర్ ఆయనకు సీఎస్ పోస్ట్ ఇచ్చారు. అలా.. తోటీ ఐఏఎస్‌లలోనూ ఆయనపై వ్యతిరేకత ఉంది.
సోమేశ్ కుమార్ ఉన్నపళంగా ఏపీకి వెళ్లానుకోవడం లేదు. తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన తనకు ఏపీకి వెళ్తే ఇప్పటికప్పుడు ప్రాధాన్యమైన పోస్ట్ దక్కదని ఆయన భావిస్తున్నారు. మరో పదకొండు నెలల్లో ఆయన సర్వీసు ముగియనుంది. అందుకే ఏపీకి వెళ్ళడం కన్నా ఐఎఎస్ కు రాజీనామా చేయాలనుకుంటున్నారు. ఆయన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తే వెంటనే కేసీఆర్ సలహాదారు పదవి ఇస్తారని ఆయన నమ్మకంగా ఉన్నారు.
Also Read : సోమేశ్ కుమార్ కు హైకోర్టు ఝలక్ – ఏపీకి వెళ్ళాల్సిందే..!