ఎమ్మెల్యే సీతక్క. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ లీడర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందుకే పార్టీలకు అతీతంగా సీతక్కను అభిమానిస్తుంటారు. పేదల మనిషిగా నిత్యం ప్రజల్లో ఉండే సీతక్క కొడుకు గురించి పెద్దగా బయటకు తెలియదు. కాని సీతక్క కొడుకు సూర్య కూడా రాజకీయాల్లో అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు.
సీతక్క ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే పోటీ చేయనుండగా..ఆమె కొడుకు మాత్రం పినపాక నుంచి పోటీకి సిద్దం అవుతున్నాడు. 2018ముందస్తు ఎన్నికల్లో పినపాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రేగా కాంతారావు బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి సూర్య అక్కడ వరుసగా పర్యటిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పినపాక నుంచి బరిలో ఉండనుంది నేనేనని సంకేతాలు ఇస్తున్నారు.
ఇన్నాళ్ళు సూర్య పోటీ చేయనున్నారా..? లేదా..? అనే సందేహాలకు తాజాగా తెరదించారు సూర్య. మొదటిసారిగా పినపాక నుంచి పోటీకి రెడీ అంటూ ప్రకటించేశారు. హైకమాండ్ ఆదేశిస్తే తప్పకుండా పినపాక నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన పినపాకలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ వద్ద సీతక్కపై మంచి ఇంప్రెషన్ ఉండటంతో ఆమె కుమారుడికి వచ్చే ఎన్నికల్లో సీట్ ఖాయమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : పాలమూరు నుంచి ప్రధాని పోటీ..?