ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ టార్గెట్ బీజేపీ. ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ పై ఫోకస్ చేసింది. నోటీసులు కూడా ఇచ్చింది. ఒకానొక దశలో ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటకు రావడంతో అమిత్ షా కు కూడా సిట్ నోటీసులు ఇస్తుందని లీకులిచ్చారు. కాని అనుకున్నదేం జరగలేదు.
ఈ నెలలో బీఎల్ సంతోష్ హైదరాబాద్ కు వస్తున్నారు. 28,29 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది. అమిత్ షా, బీ ఎల్ సంతోష్ అండ్ సునీల్ బన్సల్ లు ఈ సమావేశంలో పాల్గొని పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వలేకపోయారు పోలీసులు. సిట్ పై హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఈ కేసుపై ఇంకా విచారణ జరుగుతోంది. అసలు సిట్ విచారణ చేయడం కుదరదంటూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సిట్ హై కోర్టుకు వెళ్లడంతో విచారణ జరుగుతోంది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హై కోర్టు కొట్టివేయకపోతే సిట్ కథ ముగిసినట్లే.
బీజేపీపై దూకుడు పెంచిన కేసీఆర్…ఆ పార్టీకి తెలంగాణలో ఊపిరాడకుండా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నెంబర్ టు, నెంబర్ త్రీ అమిత్ షా, బీఎల్ సంతోష్ లకు నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతున్న వేళ వారి హైదరాబాద్ పర్యటన ఆసక్తి రేపుతోంది.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.