ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాని పాల్గొనే అధికారిక మీటింగ్ లో కేసీఆర్ కు ఆహ్వానం ఉంది కానీ ఆయన హాజరు కావడం లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. అయితే తెలంగాణ పర్యటనలో ప్రధాని బీఆర్ఎస్ పై ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది అందరిలో నానుతోన్న ప్రశ్న. గతంలో బీఆర్ఎస్ టార్గెట్ గా మోడీ అగ్రెసివ్ గా మాట్లాడిన సందర్భాలు ఏమి లేవు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా పరోక్షంగా బీఆర్ఎస్ కు చురకలు అంటించారు తప్పితే నేరుగా బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేయలేదు.
కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు టోటల్ డిఫరెంట్. బీఆర్ఎస్ – బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ లో రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులతో బీఆర్ఎస్ – బీజేపీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇదిలా ఉండగానే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ పర్యటనకు వస్తున్నాపుడల్లా వాషింగ్ పౌడర్ నిర్మ అనే ప్లెక్సీలను ఏర్పాటు చేస్తూ బీజేపీని బీఆర్ఎస్ ట్రోల్ చేస్తోంది. మోడీ పర్యటన సందర్భంగా కూడా అదే తరహాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్ కంటిన్యూ చేస్తోంది. ప్రధాని తెలంగాణ పర్యటనను నిరసిస్తూ సింగరేణి ఏరియాలో నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో బీఆర్ఎస్ పై ప్రధాని ఎలాంటి వ్యూహం అనుసరిస్తారని అందరిలో ఓ రకమైన క్యూరియాసిటీ కనిపిస్తోంది.
బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించేందుకు ప్రధానికి అన్నో అంశాలు ఉన్నాయి. మోడీని సర్కార్ ను కూల్చేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారని…బీజేపీయేతర కూటమికి తనను చైర్మన్ గా చేస్తే అన్ని పార్టీల ఎన్నికల ఖర్చులను తాను భరిస్తానని కేసీఆర్ ఆఫర్ ఇచ్చినట్లు జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇటీవల పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ ను అర్దరాత్రి అరెస్ట్ చేయడంపై మోడీ సీరియస్ అయ్యారని కూడా వార్తలు వచ్చాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ పై మోడీ విమర్శల జడివాన కురుపిస్తారా..? అనేది చూడాలి.
కాని అధికారిక కార్యక్రమం కాబట్టి ప్రధాని విమర్శల జోలికి వెళ్తారా.? అభివృద్ధిలో కేంద్రం పాత్రను వివరించి తెలంగాణ నుంచి వెనుదిరుగుతారా..? అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.
Also Read : కవిత కోసం బండిపై కేసీఆర్ మెతక వైఖరి..?