రోమ్ నగరం తగలబడిపోతుంటే..నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఈశాన్య రాష్ట్రాల ఇంఛార్జి మంత్రి కిషన్ రెడ్డి తీరు ఉంది. మణిపూర్ లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపేస్తుంటే…కిషన్ రెడ్డి భేషుగ్గా తెలంగాణలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మణిపూర్ యుద్దకాండపై మౌనం వహిస్తున్నారు. ఇంచార్జ్ మంత్రి హోదాలో అక్కడ పర్యటించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన కిషన్ రెడ్డి మణిపూర్ తగలబడిపోతుంటే నాకేంటి అన్నట్లుగా తెలంగాణలో రాజకీయంపై దృష్టిసారించారు.
దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పే బీజేపీ నేతలు… దేశంలో అంతర్భామైన మణిపూర్ లో దారుణ మరణహోమం జరుగుతుంటే రాజకీయంపై దృష్టిపెట్టారు. మణిపూర్ ఘటన ఏమంత సీరియస్ అంశమే కాదన్నట్లు తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ బాగోతంపై పోరుకు కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. యావత్ దేశం మణిపూర్ ఘటనపై తమ స్పందనను వ్యక్తీకరిస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆ అంశాన్నే ప్రస్తావించలేదు.
ఓ వైపు మణిపూర్ మత కలహాలతో చిద్రం అవుతుంటే.. మరోవైపు తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు డైలాగ్ వార్ ప్రారంభించాయి. ఇందులో ఎక్కడ మణిపూర్ అంశాన్ని అటు బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ ప్రస్తావించలేదు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని చెప్పిన బీఆర్ఎస్ , బీజేపీ రాజకీయాలకు తలొగ్గి మణిపూర్ పై నోరు పెగల్చలేదు. మణిపూర్ బాధితుల పక్షాన కేసీఆర్ , కేటీఆర్ గర్జించలేదు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని రాహుల్ గాంధీ చేసిన విమర్శలే బహుశ నిజమేనేమో.
ఎందుకంటే మణిపూర్ గాయంపై మోడీ స్పందించలేదు. గురువు స్పందించలేదని కిషన్ రెడ్డి , తమ బంధువుల పార్టీ స్పందించలేదని బీఆర్ఎస్ కూడా సైలెన్స్ మెయింటేన్ చేస్తుందేమోనాన్న అనుమానాలు అందరిలో కల్గుతున్నాయి.
Also Read : ఆరని మణిపూర్ మంటల వెనక దాగిన దోషులు ఎవరు..?