టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య మళ్ళీ ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయా..? అంటే ఉన్నాయనే సమాధానం వస్తోంది.
ప్రస్తుతం సామ్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. టాలీవుడ్ ప్రముఖులంతా ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే, నాగ చైతన్య కూడా కాస్త ఆలస్యమైన ఆసుపత్రికి వెళ్లి సమంతను పరామర్శించాడని అంటున్నారు. సమంతను ఒక్కసారిగా అలా చూసే సరికి తట్టుకోలేకపోయిన చైతూ సమంత దగ్గరకెళ్ళి ఆమెను ఓదార్చాడని, ఆమె కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలోనే చైతూను విడాకులు రద్దు చేసుకోవాలని నాగార్జున కోరాడట. సమంత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు తోడు అవసరమని.. ఆమెను అమితంగా ప్రేమించిన వ్యక్తివి నువ్వు. తన దగ్గర నువ్వుంటేనే బాగుంటుందని నాగార్జున చైతుకు చెప్పాడట. అందుకు చైతూ కూడా ఒకే చెప్పాడట.
నాగ్ ప్రతిపాదనకు చైతూ అంగీకరించాడు కాని సమంత కుటుంబ సభ్యులు అంగీకరిస్తారో లేదో చూడాలి.