జి – 20 విదేశాంగ మంత్రుల సమావేశం ఈ రోజు మన దేశంలో మొదలవుతోంది. ప్రపంచం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురు చూసేందుకు కారణం ఒక్కటే – రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ఇండియా ఎలా అపుతుందని. ఈ యుద్దాన్ని ఆపే చొరవ ఒక్క ఇండియాకు మాత్రమే ఉన్నదని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. అందుకే ఈ సారి జి – 20 దేశాల నిర్వహణ ఇండియా కు అప్పగించారు.
నిజానికి ఈ అవకాశం చైనా కు కూడా ఉంది. ఎందుకంటే ఇండియా, చైనా రెండు దేశాలు రష్యాకు రెండు కళ్ళ వంటివి. కానీ చైనా, అమెరికాకు పడదు. రష్యా, అమెరికాకు కూడా పడదు. కానీ ఇండియా మాత్రం అటు అమెరికా, ఇటు రష్యా తో మంచి స్నేహ సంబందాలు కలిగి ఉంది. ఆ మాట కొస్తే ఒక్క పాకిస్తాన్, చైనా మినహా, మొత్తం ప్రపంచంతో మంచి స్నేహ సంబందాలు కలిగి ఉంది.
చైనా డబుల్ గేమ్ ఆడొచ్చని అమెరికా అనుమానం. అందుకే అందరు ఏకగ్రీవంగా ఇండియా మీదే భారం వేశారు. ప్రపంచ పెత్తందారి దేశాల జాబితాలో చేరడానికి ఇండియాకు ఇది గొప్ప సువర్ణ అవకాశం. నిజంగా ఈ యుద్ధం గనక ఆపగలిగితే ఇండియా హీరోలా మారుతుంది. అన్ని దేశాలు ఇండియా కనుసన్నల్లో ఉండే గొప్ప అవకాశం.
ఆ మధ్య అమెరికా ఒత్తిడి మేరకు మోడి ఈ శాంతి ప్రక్రియను మొదలు పెట్టారు. యుద్ధం ఆపాలని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కి హితవు చెప్పారు. పుతిన్ ఇప్పుడున్న పరిస్తితిలో ఇండియాను ఎదిరించలేరు. ఇప్పుడు ఆ దేశాన్ని ఆదుకుంటోంది కూడా ఇండియానే. కేవలం 5 దేహాలు మాత్రమే రష్యాకు అండగా ఉన్నాయి. ఇందులో ఇండియానే ముందు వరుసలో ఉంది. చాలా తెలివిగా రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొని ఎక్కువ ధరకు ప్రపంచానికి అమ్ముతోంది. కాబట్టి పుతిన్ మెత్తబడి యుద్ధం విరమించడానికి ఒప్పున్నారు.
కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్ స్కి దానికి ఒప్పుకోలేదు. రష్యా యుద్ధం ఆపితే సరిపోదు – ఇప్పటివరకు జరిపిన దాడుల వల్ల జరిగిన నష్టపరిహారం కూడా చెల్లించాలని కొత్త ఫిట్టింగ్ పెట్టారు. చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదని పుతిన్ తిరగబడ్డాడు. ఎవరి వాదనలో వాళ్లు కరెక్ట్. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపంలా మారింది గడ్డు పరిస్టితి. దాంతో ఎవ్వరికి సర్ది చెప్పలేక మోడి మౌనం వచించారు.
ఈ రోజు జరిగే సమావేశంలో కూడా ఇదే అంశం మళ్ళి పునరావృతం కావచ్చు. మరి దీనిని మోడి ఎలా పరిష్కరిసారో చూడాలి. ఒకవేళ మోడి చక్రం తిప్పి యుద్ధం ఆపితే శాంతి నోబెల్ తప్పక వస్తుంది. ”ఛల్ బసంతీ! ఆజ్ తేరా ఇండియా కా ఇజ్జత్ కా సవాల్ హై” అనే షోలే సినిమా మాట గుర్తుకు వస్తోంది.