ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. అభివృద్ధి పనుల మీదే మోడీతో భేటీ అయినట్లు వెంకట్ రెడ్డి చెబుతున్నారు. కాని ఇద్దరు రాజకీయ నేతల మధ్య రాజకీయ అంశాలు చర్చకు రాకుండా ఉంటాయా..? అసలు ఆ చాన్సే లేదు. ప్రధానితో కోమటిరెడ్డి భేటీ సమయంలో రాజకీయాలపై చర్చ జరిగే ఉంటుంది. అయితే , ఏం చర్చించారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అది ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రకటించిన టీపీసీసీ జంబో కమిటీ ఎందులోనూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఏఐసీసీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. సీనియర్లమైన తమను పట్టించుకోవడం లేదని ఆయన వర్షన్ ఆయన వినిపించారు. అయితే, ఖర్గే నుంచి పాజిటివ్ నెస్ కనిపించిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బయటకు చెప్పుకుంటున్నారు. కాని ఆయనను కాంగ్రెస్ మరోసారి నమ్మి మోసపోయెందుకు సిద్దంగా లేదు. అందుకే , హైకమాండ్ ను బెదిరించి తన దారిలో తెచ్చుకోవాలని కోమటిరెడ్డి ప్రధాని అపాయింట్ మెంట్ కోరినట్లు అర్థం అవుతోంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు గోడ దూకేస్తారా..?కండువా కప్పేదామా..? అనే ఆలోచనతో ఉన్ననున్న బీజేపీ అగ్రనాయకత్వం, వెంకట్ రెడ్డి అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చేసింది. ఇందులో భాగంగా ప్రధానితో 20నిమిషాల పాటు వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రధానిని కలిసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నా ఇది ఓ రకంగా ఆయన కాంగ్రెస్ ను బెదిరించేందుకు చేస్తోన్న చర్యలుగానే కనిపిస్తున్నాయి