ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్న కమలనాథులు ఆయన చేరికతో పార్టీ పుంజుకుంటుందని ఆశలు పెట్టుకున్నారు. కిరణ్ చేరికతో ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడెం తెలియదు. మరికొద్ది నెలలోనే రిజల్ట్ రానుంది. ఏపీలో బలపడేందుకు కిరణ్ ఓ ఆశాకిరణం అవుతారని గతంలో కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది ఇప్పుడు బీజేపీ కూడా అవే ఆశలు పెట్టుకుంది. ఎనిమిదేళ్లుగా రాజకీయాల్లో పత్తాకు లేని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో యాక్టివ్ పాలిటిక్స్ చేసిన పెద్దగా ప్రయోజనం ఉంటుందని అనుకోవడానికి లేదు.
రాష్ట్ర విభజన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ను వీడి జైసమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసినా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. కనీసం చెప్పుకోదగ్గ నేతలెవరూ ఆ పార్టీలో చేరలేదు. ఆ తరువాత మళ్ళీ సైలంట్ అయ్యారు. ఆ మధ్య కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పదవులు ఇవ్వలేదన్న అసంతృప్తో ఇతర కారణమో కానీ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పేసి కమలం క్యాంప్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరినప్పుడు ఎలాగైతే స్తబ్దంగా ఉన్నారో ఇప్పుడు కూడా సైలెంట్ మోడ్ లోనే ఉంటె కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ నేతలు కూడా ఆయనతో కలిసి రాలేదు. అయితే.. ముఖ్యమంత్రిగా కొనసాగిన కిరణ్ కుమార్ రెడ్డికి నేతలతో పెద్దగా సన్నిహిత సంబంధాలెం లేవు. ఇతర నేతలను కన్విన్స్ చేసేంత కెపాసిటీ కూడా లేదు. అందుకే ఆయన కాంగ్రెస్ ను వీడి పార్టీ పెట్టినప్పుడు బలమైన నేత ఒక్కరు కిరణ్ తో చేతులు కలపలేదు . అందుకే ఆయన పార్టీ చేరిక ప్రోగ్రాంలో ఒక్కరంటే ఒక్కరు బలమైన నేత ఆయన వెనక కనిపించలేదు.
ఇదంతా పక్కన పెడితే బీజేపీలో కింగ్ మేకర్ కావాలనుకుంటున్న కిరణ్ కుమార్ ఏపీ బీజేపీలోని మూడు వర్గాలును తట్టుకొని రాజకీయం చేస్తారా..? అనేది అందరి ప్రశ్న. ఈ గ్రూప్ రాజకీయాల వలనే బీజేపీ ఏపీలో అనుకున్నంతగా ఎదగలేకపోతోంది. వలస నేతలు వచ్చినా పరిస్థితి మారలేదు. కిరణ్ కుమార్ ఆలోచనలతో బీజేపీ ఓ ప్రయోగం చేస్తుందని.. అది విజయవంతం అవుతుందని గట్టి ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ ఆయన ఓ అవుట్ డేటెడ్ నేతగా జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. మరి బీజేపీ ఆశలు ఫలిస్తాయా..? లేదో చూడాలి.
Also Read : ఇదేందయా ఇది కిరణ్ కుమార్ రెడ్డి – నువ్వు కాంగ్రెస్ కోసం..!