సాధారణంగా మంత్రి మల్లారెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడరు. ఎందుకంటే ఆయనకు రాజకీయపరమైన భాషపై పట్టు లేకపోవడమే కారణం. ఆయనపై విమర్శలు, ఆరోపణలు వస్తేనే వాటిని ఖండించేందుకు , ఎదుడుదాడి చేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యర్ధులను తనకు నచ్చిన భాషలో కడిగేస్తారు. అప్పుడప్పుడు మీడియా ప్రతినిధులు ఆయనను కలిసేందుకు ప్రయత్నించినా పక్కకు తప్పుకుంటారు. అలాంటి మల్లారెడ్డి…కేటీఆర్ పై బండి సంజయ్ డ్రగ్స్ ఆరోపణలు చేశారని ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ స్టేట్ చీఫ్ పై రెచ్చిపోయారు.
Also Read : బీజేపీకి టచ్ లో మంత్రి మల్లారెడ్డి -వేటు వేసేందుకు కేసీఆర్ రెడీ..?
మా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరో రాష్ట్రంలో జరిగినట్లు చూపిస్తే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని మల్లారెడ్డి సవాల్ చేశారు. అంతేకాదు రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రానికి రమ్మంటే ఆ రాష్ట్రానికి వస్తా. కేసీఆర్ అభివృద్ధి చేసినట్లు మరే రాష్ట్రంలోనైనా జరిగినట్లు చూపించు అంటూ బండి సంజయ్ కు సవాల్ విసిరారు. తనపై బండి సంజయ్ చేసిన విమర్శలకు కేటీఆర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇంతలోనే మల్లారెడ్డి ప్రత్యక్షమై బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు.
Also Read : కాంగ్రెస్ పై కోవర్ట్ ఆపరేషన్ – రంగంలోకి ఎర్రబెల్లి
తన శాఖకు సంబంధించి కూడా ఏనాడూ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయని మల్లారెడ్డి.. తాజాగా కేటీఆర్ పై పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేయగానే మీడియా ముందుకొచ్చాడు. అయితే, బండి సంజయ్ పై మల్లారెడ్డి అగ్రెసివ్ గా మాట్లాడటానికి కారణం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీతో మల్లారెడ్డి టచ్ లోకి వెళ్లాడని, ఆ విషయం కేసీఆర్ కు కూడా తెలిసిందని గురువారం నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారాన్ని పరోక్షంగా ఖండించేందుకు బండి సంజయ్ పై మల్లారెడ్డి విమర్శల దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా తనపై జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించినట్లు అవుతుందని భావించి మల్లారెడ్డి ఫైర్ అయినట్లు తెలుస్తోంది.