ఈ రోజు సాయంతం 5 గంటలకు కరీంనగర్ వేదికగా జరగబోయే కాంగ్రెస్ భారీ భహిరంగ సభకు ఛత్తీస్ ఘడ్ ముఖ్య మంత్రి భుపేష్ బగల్ ముఖ్య అథిదిగా హాజరు కాబోతున్నారు. లోగడ ఇదే కరీంనగర్లో 2004లో భారీ భహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొనడం. అదే సభలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించి తెలంగాణ ఇస్తానని ఆమె తొలిసారి మాటిచ్చింది ఇక్కడే. ఆమె ఇచ్చిన మాట ఆ తరువాత నిలబెట్టుకున్నారు.
ఇప్పటివరకు ఇక్కడ జరిగిన సభలల్లో చేసిన అన్ని ప్రమాణాలు విజయవంతం అయ్యాయి. దానితో కరీంనగర్ సభలు కాంగ్రెస్ కు చాలా సెంటిమెంట్లతో ముడిపడి ఉన్నాయి. అందుకే కరీంనగర్ లో రేవంత్ సారధ్యంలో సొనియమ్మకు కృతజ్ఞత చెప్పుకుందామంటూ సభను నిర్వహిస్తున్నారు.
నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యకుడిగా పదవి చేపట్టిన నాటినుంచి కాంగ్రెస్ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ముఖ్యంగా యువకులు ఈసారి కాంగ్రెస్ వైపు దృష్టి సారించారు. ఆయన ఎక్కడ సభలు పెట్టినా తండోపతండాలుగా వస్తున్నారు. ఇందులో రైతులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ మైలేజ్ ఒక్కసారిగా పెరిగింది.
ఇదే ఊపు కొనసాగితే ఈ సారి కాంగ్రెస్ 70 నంచి 84 అసెంబ్లీ సీట్లు గెలిచే అవకాశం ఉందని ఇటీవల విడుదలైన సర్వేలు ముక్త కంఠంతో తేల్చి చెప్పాయి. ఇది కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. టీ కప్పులో తుఫానులా మొన్నటివరకు విభేదాలతో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కటి కావడం రేవంత్ రెడ్డి నాయకత్వానికి బలాన్ని చేకూర్చాయి.
అందుకే ఈ సభలో రేవంత్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రకటించే పలు అభివృద్ధి పథకాలను ఇక్కడ ప్రకటించే అవకాశం ఉంది. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భుపేష్ బగల్ ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘వరికి మద్దతు ధర’ను ఇక్కడ తెలంగాణకు కూడా ఇచ్చే ప్రకటన చేయవచ్చు. ఇప్పటికే ప్రకటించిన తక్కువ గ్యాస్ ధరలు, పోడుభుముల పంపిణితో పాటు కొత్త పథకాలు ప్రకటిస్తారు. దీనితో పాటు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం, ఈడి ఆమెకు సమన్లు పంపిన వ్యవహారం గురించి దుమ్మెతి పోసే అవకాశం ఉంది.