దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్రపై ముఖ్యులతో చర్చించేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన అని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నా..హస్తిన టూర్ వెనక పెద్ద తతాంగమే నడుస్తోందని తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో తన కూతురిని కాపాడుకునేందుకు ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తోన్నకేసీఆర్ బీజేపీ విధించిన షరతులన్నింటిని అంగీకరించేందుకు రెడీ అయిపోయినట్లు తాజా సమాచారం. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన బూర నర్సయ్యను బీజేపీలోకి పంపేందుకు కేసీఆర్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థలు చేసిన సర్వేలో బీజేపీ ఓటమి అంచున ఉందని తేలింది. దాంతో గెలుపు వ్యూహాలపై దృష్టి సారించింది బీజేపీ హైకమాండ్. ఇందులో ప్రధానంగా బీసీ ఓటర్లను బీజేపీ వైపు అట్రాక్ట్ చేస్తే రాజగోపాల్ రెడ్డిని గట్టేక్కించవచ్చునని వ్యూహం రచించింది. ఆ సామజిక వర్గం ఓటర్లను ఆకర్షించాలంటే బలమైన నేత కోసం అన్వేషించిన బీజేపీకి బూర ఆశా కిరణంలా కనిపించాడు. ఎలాగూ.. లిక్కర్ స్కాం నుంచి కవితను సేవ్ చేసేందుకు బీజేపీ విధించిన షరతులకు అంగీకరించిన కేసీఆర్.. ఒప్పందంలో భాగంగా బూర నర్సయ్యను బీజేపీలోకి పంపుతున్నట్లుగా తెలుస్తోంది.
టికెట్ దక్కలేదని అలక పాన్పు ఎక్కిన బూర నర్సయ్యను ఇటీవలే ప్రగతి భవన్ కు పిలిపించుకొని కేసీఆర్ బుజ్జగించారు. ఆ తరువాత ఆయన కొంత మెత్తబడినట్లు కనిపించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిన తరువాత బూర నర్సయ్య కూడా హస్తిన వెళ్ళడం…అదే సమయంలో బండి సంజయ్ హస్తినను అంటిపెట్టుకోవడం చకచక జరిగిపోయింది. ఈ కేసీఆర్ కు అమిత్ షా దూతల నుంచి వచ్చిన షరతుల మేరకు బూరను వదులుకునేందుకు కేసీఆర్ అంగీకరించినట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.