విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం చింతల ఆగ్రహారానికి చెందిన మాజీ సర్పంచ్ పొలమరశెట్టి వెంకట కృష్ణ కుమారుడు పెద్దినాయుడు. వాళ్ళ కుటుంబంలో అందరు బాలకృష్ణకు వీర అభిమానులు. పెద్దినాయుడు రెండేళ్ళ కిందట గౌతమి అనే అమ్మాయిని ప్రేమించాడు. అతని కోరిక ఒక్కటే. బాలకృష్ణ దీవెనలతో తన పెళ్లి జరగాలని. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది.
అందుకే అతను బాలకృష్ణను కలిసి తన పెళ్ళికి రావాలని కోరాడు. బాలకృష్ణ చెప్పిన రోజునే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు పెద్దినాయుడు. ఇలాంటి వీరాభిమానులను ఎందరినో చూసిన అయన ‘మంచి ముహూర్తం చూసి పెళ్ళికి పిలువు’ అని మాటవరుసకు అన్నారు.
పెద్దినాయుడు మంచి ముహూర్తం చూసి, ఆ పెళ్లి పత్రిక మీద బాలకృష్ణ, ఎన్ టి రామారావు బొమ్మలు ముద్రించాడు. ఆ పెళ్ళి పత్రికను బాలకృష్ణ కు ఇచ్చి పెళ్ళికి రమ్మని వేడుకున్నాడు. బాలకృష్ణ రాకపోతే ఆ పెళ్లి జరగదని చెప్పాడు. అందరికి చెప్పినట్లే తప్పక వస్తాను అని చెప్పి తప్పించుకున్నారు బాలకృష్ణ.
అటు షూటింగ్లు, ఇటు రాజకీయాల వత్తిడి వళ్ళ బాలకృష్ణ ఆ పెళ్ళికి వెళ్ళలేదు. అంతే! బాలకృష్ణ లేనిదే పెళ్లి చేసుకోను అని పెద్దినాయుడు ఆ పెళ్లిని వాయిదా వేశాడు. ఈ విషయం తెలిసి బాలకృష్ణ ఖంగుతిన్నాడు.
రెండోసారి పెద్ది నాయుడు పెళ్లి ముహూర్తం పెట్టి ఎప్పటిలా బాలకృష్ణ పెళ్లి పత్రిక ఇచ్చాడు. మీరు రానిదే ఈ పెళ్లి జరగదు అని మరోసారి చెప్పాడు. బాలకృష్ణ వస్తాని మాటిచ్చారు. కానీ సమయం కుదరక వెళ్ళలేదు. మళ్ళి పెళ్లి ఆపుకున్నాడు ఆ అభిమాని. ఇలా రెండు ఏళ్లుగా ఆ పెళ్లి ఎన్నోసార్లు వాయిదాలు పడుతువస్తోంది.
ఇది తెలిసి బాలకృష్ణకు జాలేసి తనకు అనుకూలమైన మర్చి 11 తేది అప్పాయింట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ రోజు పెద్ది నాయుడు పెళ్లి. బాలకృష్ణ వెళ్ళితే కానీ ఈ రోజు ఆ అభిమాని పెళ్లి జరిగేలా లేదు. లేకపోతే ఎప్పటిలా వాయిదా పడేలా ఉంది. బాలకృష్ణ వెళ్లి ఆ వీరాభిమాని పెళ్లి చేస్తారో లేదో చూడాలి.