సంక్రాంతి తరువాత కేంద్రమంత్రి వర్గాన్ని విస్తరిస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పండగ అయిపోవడంతో మంత్రివర్గ విస్తరణపై అందరి దృష్టి పడింది. తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఎన్నికలున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు.
బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేసిన తెలంగాణ , మధ్యప్రదేశ్ , రాజస్థాన్, చత్తీస్ ఘడ్ ఎంపీలకు కేంద్రమంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఓ కేంద్రమంత్రి ప్రాతినిధ్యం ఉంది. కాని ఏపీకి లేదు. దీంతో ఏపీకి కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాని అలాంటి ఛాన్స్ లేనట్టు తెలుస్తోంది.
తెలంగాణ నుంచే మరో ఎంపీకి కేంద్రమంత్రి వర్గంలో అవకాశం కల్పించనున్నారు. తెలంగాణకు బెర్త్ ఖరారు చేసి తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు మంత్రుల్ని ఇచ్చినట్లు చెబుతారని తెలుస్తోంది. ఏపీ నుంచి బీజేపీకి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాత్రమే ఉన్నారు. జీవీఎల్ ఉన్నప్పటికీ ఆయన యూపీ కోటాలో ఎంపీ అయ్యారు. సీఎం రమేష్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే పార్టీ మారిన నేతకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. జీవీఎల్ కు ఇస్తే.. యూపీకి కేంద్రమంత్రి పదవి ఇచ్చినట్లు అవుతుంది. సో.. ఈ లెక్కన ఏపీకి మంత్రిపదవి లేనట్టే కనిపిస్తోంది.
ఓ సహాయ మంత్రి పదవి అయినా ఏపీకి ఇవ్వకపోతే రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసినట్లవుతుందన్న భావన ఏర్పడుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే…ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపే నేత లేరని.. కేంద్ర బీజేపీ వర్గాలు లైట్ తీసుకుంటున్నాయి.
Also Read : జనసేన టీడీపీ పొత్తు -ఆ 55సీట్లను కోరుతోన్న పవన్ కళ్యాణ్..!