ఇకరి బట్టలు మరొకరు ఎక్స్చేంజ్ చేసుకోడం తెలుసు. ఒకరి బైక్ లు మరొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా చూసాము. కానీ ఒకడి భార్యను మరొకడు ఎక్స్చేంజ్ చేసుకుని పెళ్లి చేసుకున్న సంఘటన గురుంచి మీరు ఈ కలియుడంలో చూసారా? చూడక పొతే ఇప్పుడు చూడండి.
బీహార్ లోని ఖగాడియా అనే జిల్లా లోని హర్దియా గ్రామంలో కూలి పని చేసే ముఖేష్ అనే యువకుడు రూబి (సీనియర్) అనే అమ్మయిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. విచ్చలవిడిగా తిరిగారు. కానీ కొన్ని కారణాలవల్లా వాళ్ళ పెళ్లి జరగలేదు.
రూబి (సీనియర్) అనబడే ఆమె ఓ ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేసే నీరజ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. నలుగు పిల్లలు పుట్టారు.
ఆ తర్వాత ముఖేష్ రూబి జూనియర్ ని (ఇద్దరి పేర్లు రూబీ కాబట్టి జూనియర్, సీనియర్ అని రాయాల్సి వస్తోంది) పెళ్లి చేసుకున్నాడు. సంసారం బాగానే సాగుతున్నా అతని మసను మాత్రం ప్రేయసి రూబి (సీనియర్) మీదే ఉంది. పెళ్లి తర్వాత కూడా ఆ ఇద్దరు మునపటిలా అక్రమ సంబంధం కొనసాగించారు. ఇది తెలిసిన నీరజ్ అటు భార్యను, ఇటు ఆమె ప్రియుడు ముఖేష్ ని మందలించాడు. రోజు రోజుకు గొడవలు ముదురుతున్నాయి. ఆ ఇద్దరి మీద పోలీసులకు పిర్యాదు చేశాడు నీరజ్. ఎలాగో చెడ్డపేరు వచ్చింది కాబట్టి ముఖేష్, రూబి (సీనియర్) లేచిపోయి దర్జాగా పెళ్లి చేసుకున్నారు.
ఈ విషయం తెలిసిన నీరజ్ వాళ్ళమీద కత్తి కట్టాడు. ముఖేష్ని చంపాలని పథకం రచించాడు. అప్పటికే రూబి (జూనియర్) కి తన భర్త ముఖేష్ మీద మససు విరిగింది. ముఖేష్ ని హత్యచేసి నీరజ్ జైలు పాల్యయితే అతని పిల్లలు అనాధలు అవుతారని రూబి (జూనియర్) బుజ్జగించింది. ముల్లుని ముళ్ళు తోనే తీయాలి – మనం కూడా పెళ్లి చేసుకుని వాళ్ళకు బుద్ది చెప్పాలని ఓ దారి చూపింది. ఎక్స్చేంజ్ ఆఫర్ లాగా మనం కూడా పెళ్లి చేసుకుందాం అన్నది.
ఇదేదో బాగుంది అనుకున్న నీరజ్ ఆ గ్రామంలో పంచాయితీ పెట్టి తమ నిర్ణయం చెప్పి తీర్పు చెప్పమన్నారు. గ్రామస్తులకు అది బాగానిపించింది. అందరు ఇలా అక్రమ సంబంధాల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించు కోవాలని ఆ ఇద్దరికీ పెళ్లి చేశారు.
౦౦౦