తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కడుపుతీపి ఎలా ఉంటుందో తెలిసివచ్చింది. శనివారం కవిత ఈడీ విచారణకు వెళ్లి తిరిగి వచ్చే వరకు క్షణమొక యుగంగా గడిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేస్తారేమోనని కేసీఆర్ తోపాటు కేటీఆర్ ,హరీష్ రావులు టెన్షన్ ఫీల్ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముగియగానే హుటాహుటిన హస్తినకు వెళ్ళారు కేటీఆర్ అండ్ హరీష్ రావులు. శనివారం నాటి షెడ్యూల్ ను పూర్తిగా రద్దు చేసుకొని హస్తినలో వాలిపోయారు. ఢిల్లీలో వీరిద్దరూ కవిత ఈడీ విచారణపైనే మానిటరింగ్ చేస్తూ కూర్చున్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ కు ఢిల్లీలోని పరిస్థితిని అప్డేట్ చేశారు. ఒకవేళ ఆమెను అరెస్ట్ చేస్తే బెయిల్ అప్లై చేసేలా సమాయత్తం అయ్యారు.
కవిత కోసం అంత శ్రద్ధ ఎందుకు..?
తెలంగాణలో లిక్కర్ వలన ఎంతోమంది మహిళలు వితంతువులుగా మారుతున్నారు. ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కొంటున్న కవితకు కల్వకుంట్ల కుటుంబం మద్దతు ఇచ్చింది. సరే కుటుంబం అన్నాక… తప్పు చేసినా కడుపుతీపితో మద్దతు ఇచ్చేందే అనుకుందాం. కానీ బీఆర్ఎస్ శ్రేణులు కూడా మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన కవితకు మద్దతు నివ్వడం… ఆమె తెలంగాణ ఫైటర్ అయినట్లు ఫ్లెక్సీలు,హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం అమాయకత్వమే తప్ప మరొకటి కాదు. కేసు విచారణలో అన్ని బయటకు వస్తాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇదంతా జరిగితే కవిత ఎప్పుడో కోర్టును ఆశ్రయించేవారు.
కవితను విచారిస్తే మహిళలకు కన్నీళ్ళా..?
కవితకు ఆపదోస్తే తెలంగాణ మహిళలు కన్నీళ్లు పెడుతున్నారని మహిళా మంత్రులు వ్యాఖ్యానించడం అందరికి నవ్వులు తెప్పిస్తోంది. రాష్ట్రంలో వరుసపెట్టి మహిళలపై అత్యాచారాలు జరిగితే ఏనాడూ మహిళా మంత్రులు స్పందించలేదు. తెలంగాణలో మహిళా అస్తిత్వానికి ప్రతీకగా చూపుతున్న కవితమ్మ ఏనాడూ నోటికి బట్ట తీయలేదు. మొన్నటికి మొన్న ప్రీతి సంఘటన జరిగితే బాధిత కుటుంబాన్నీ పరామర్శించలేదు.కేవలం ఓ లేఖ రాసి చేతులు దులుపుకుంది. అలాంటిది కవితపై ఈడీ విచారణ జరిగితే తెలంగాణ మహిళ సమాజం ఎందుకు కన్నీళ్లు పెడుతుందనేది ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తోంది. పైగా.. మహిళల పుస్తెలు తెంపెందుకు కారణం అవుతోన్న మద్యం వ్యవహారంలో కవితకు ఈడీ నోటిసులు ఇస్తే కన్నీళ్లు పెడుతారా..? మహిళా మంత్రులు ఆలోచించాలి. సెంటిమెంట్ రాజకీయాలు ప్రతిసారి వర్కౌట్ అవ్వవనే వాస్తవాన్ని గుర్తించాలి.
ఏనాడైనా ఇలా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశారా…?
సింగరేణి కాలనీలో చైత్రపై హత్యాచారం జరిగినప్పుడు…నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ నేత ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించినప్పుడు,సిరిసిల్లలో కేటీఆర్ అనుచరుడు బాలికపై అత్యాచారం చేసినప్పుడు…స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య రాసలీలలను సొంత పార్టీ మహిళా ఎండగట్టినప్పుడు…ప్రీతి ఆత్మహత్య చేసుకున్నప్పుడు.. ఇలా రాష్ట్రంలో వరుసపెట్టి జరుగుతోన్న దారుణ ఘటనలపై కేసీఆర్ కాని మంత్రులు కాని అత్యవసర సమావేశం నిర్వహించారా.? ప్రీతి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే…ఆరడుగుల దూరంలోనున్న ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ కదిలారా..? లిక్కర్ స్కామ్ లొ ఇరుకున్న కూతురి కోసం మాత్రం ఓ రోజంతా ఖర్చు చేశారు. అయినా… బంగారు తెలంగాణలో సామాన్య మహిళల మాన ప్రాణాలకు విలువ ఎక్కడిది కేసీఆర్..? ఈ సామాన్యుల కడుపుల పుట్టినోల్లంతా ఓట్లేసే యంత్రాలే .. దొరసానులకు హారతులు పట్టే బానిసలే కదా..
మీడియా అతి
కవిత ఈడీ విచారణ రోజున తెలుగు మీడియా చేసిన అతి అంత ఇంతా కాదు. ప్రజా సమస్యలు పక్కనపెట్టేసి… రోజంతా ఆమె గురించే వార్తలు. కవిత అరెస్ట్ అవుతుందా..? అరెస్ట్ అవుతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది.? అరెస్ట్ కాకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది..?ఇదే అంశాల చుట్టూ వార్తలను నడిపారు. ఈ వార్తల పరంపరలో ఆరోజు ప్రజా సమస్యలన్నీ కొట్టుకుపోయాయి. రిప్ తెలుగు మీడియా
Also Read : కవితకు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ…ఈసారి ఛాన్స్ ఇచ్చేది లేదంటున్న ఈడీ