జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను కోర్టు మరోసారి కొట్టివేసింది. హత్యలు చేసి తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికీ న్యాయస్థానాల్లో బెయిల్ వస్తోంది. కాని శ్రీనివాస్ మాత్రం నాలుగేళ్ళుగా జైల్లోనే మగ్గిపోతున్నారు. ఆయన తల్లి తన కొడుకుకు బెయిల్ ఇప్పించాలని జగన్ ను కోరుతున్నారు. కాని వైసీపీ నుంచి సరైన రియాక్షన్ లేదు.
నిజానికి శ్రీనివాస్ కు ఎప్పుడో బెయిల్ వచ్చింది. జగన్ సీఎం బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్ళకే NIA కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెంటనే ఏపీ సర్కార్ రంగంలోకి దిగింది. శ్రీనివాస్ కు బెయిల్ రద్దు చేయాలని NIAకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ సర్కార్ వలన శ్రీనివాస్ కు ఎన్ఐఏ బెయిల్ రద్దు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆయనకు బెయిల్ ఇచ్చినా ఇబ్బంది లేదని ఓ లేఖ ఇస్తే ఎన్ఐఏ బెయిల్ వచ్చేలా చూస్తుందని అనుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆ దిశగా మొగ్గు చూపలేదు.
జనపల్లి శ్రీనివాస్.. దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. జగన్ అంటే పిచ్చ అభిమానం. జగన్ ను సీఎంగా చూడాలని… జగన్ పై సానుభూతి రావాలని కోడికత్తితో దాడికి యత్నించినట్లు శ్రీనివాస్ అంగీకరించాడు. ఎన్ఐఏ చార్జిషీటులోనూ అదే చెప్పింది. హాని చేయాలనే ఉద్దేశ్యం లేదని చెప్పుకున్నారు. ఆ కోడి కత్తి గాయం వలన జగన్ సానుభూతిని పొంది.. సీఎం పదవి పొందేందుకు ఈ ఘటన కూడా కారణమైంది. కానీ దీనికి కారణమైన శ్రీనివాస్ మాత్రం జైల్లో మగ్గిపోతున్నారు.
Also Read : హైపర్ ఆది జబర్దస్త్ మానేయడానికి కారణం ఆమెనా..?