సినిమా ఇండస్ట్రీలో ఓ సంప్రదాయం ఉంటుంది. మంచైనా, చెడైనా అందరూ కలిసే పంచుకుంటారు. కాని టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మాత్రం ఇండస్ట్రీలో ఎవరైనా ప్రముఖులు చనిపోతే ఆఖరి చూపు చూసేందుకు వెళ్లడంలేదు. ఇందుకుగల కారణం తెలియదు కాని అందరూ ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు.
Also Read : ఓ హీరో నన్ను వాడుకొని వదిలేశాడు -హీరోయిన్ అంజలి కామెంట్స్
మొన్న ఆ మధ్య టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణిస్తే నాగార్జున నివాళులర్పించేందుకు వెళ్ళలేదు. కైకాల సత్యనారాయణను ఆఖరి చూపు చూసేందుకు కూడా వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. నాగ్ ఫ్యామిలీలో ఆయన తండ్రి, తల్లి కన్నుమూసిన సమయంలో చాలామంది నివాళులర్పించేందుకు తరలివెళ్ళారు. కాని నాగార్జున మాత్రం ఎవరు కన్నుమూసినా చివరి చూపు చూసేందుకు వెళ్ళడం లేదు. ఎవరైనా మరణిస్తే ఆఖరి చూపు చూసేందుకు వెళ్ళరు కాని, ఎవైన శుభకార్యాలు ఉంటె మాత్రం తప్పకుండా వెళ్తారు. కుటుంబ సమేతంగా వెళ్లి ఆశీర్వదిస్తారు.
Also Read : ఆ డైరక్టర్ నా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా చేయాలనుకున్నాడు – ట్వింకిల్ ఖన్నా
ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే నాగార్జున వెళ్ళింది అంటే ఒక్క దాసరి ఇంటికి మాత్రమే. దాసరి నారాయణ రావు భార్య పద్మ మరణిస్తే మూడో రోజున వెళ్లి దాసరిని పరామర్శించారు. అప్పుడు కూడా ఆయన సినిమా ఒకటి ఆగిపోవడంతో దాసరిని కలిసి పరామర్శించినట్లుగా వార్తలు వచ్చాయి.
Also Read : అషూ , ఆర్జీవీల బోల్డ్ ఇంటర్వ్యూ – సె* 10నిమిషాల్లో చేసేస్తారంటూ..!
ఇక, నాగార్జున సంగతిని పక్కన బెడితే ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ మాత్రం ఈ విషయంలో నాగార్జునకు పూర్తిగా డిఫరెంట్. మహేష్ బాబు తండ్రి మరణిస్తే చైతు, అఖిల్ లు వెళ్లి మహేష్ ను ఓదార్చారు.