కెసీఆర్ తనయుడు కేటీఆర్ కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి అని బీర్ఎస్ పార్టీలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కంటే కేటీఆరే బెటరన్న అభిప్రాయాలు తన సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను వదిలి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కేసీఆర్ పెట్టినంత ఇంట్రెస్ట్ నేషనల్ పాలిటిక్స్ పై కెటిఆర్ ఎందుకు పెట్టడం లేదని చాలా మంది సందేహం. కేటీఆర్ కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేకపోవడంతోనే బీఆర్ఎస్ సభలకు ఆయన హాజరు కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోవాలన్న అభిలాషతోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదని..అందుకే రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటునారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఆలోచన ప్రకారం బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి వస్తే నెక్స్ట్ కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆరేనన్ని సంకేతాలు ఇస్తున్నారు. కేటీఆర్ ను నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ప్రకటించడం హరీష్ రావు, కవిత, సంతోష్ లకు ఇష్టలేదని అంటున్నారు. కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని సొంత కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదన్న వాదన వుంది. దీంతో కుటుంబంలోనే నెక్స్ట్ సీఎం ఎవరన్న గందరగోళం మొదలయ్యింది.
కేటీఆర్ మాత్రం సీఎం పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 17న కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తానన్నకేసీఆర్ ఆలోచన వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో పక్క కవిత, హరీష్ ల ఒత్తిడితోనే కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారన్న అసంతృప్తితో కేటీఆర్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని అధికారంలోకి తెచ్చి సీఎం పీఠంపై కూర్చోవాలని కేటీఆర్ భావిస్తున్నారు. మరి కేసీఆర్ నెక్స్ట్ సీఎం పదవి ఎవరికి అప్పగిస్తాడో చూడాలి.