బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరేందుకు తుమ్మల నాగేశ్వర్ రావు రెడీ అయ్యారు. వచ్చే నెల 6న కాంగ్రెస్ లో చేరుతారని వార్తలు వస్తున్నాయి. తుమ్మల బీఆర్ఎస్ కు రీజైన్ చేస్తున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న వాటిని ఆయన ఎక్కడ ఖండించలేదు. దాంతో తుమ్మల పార్టీ మారడం తథ్యమని ఖమ్మం జనాలు నమ్ముతున్నారు.
తుమ్మల తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇదివరకే స్పష్టం చేశారు. అదే స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ అయిన కమ్యూనిస్టులు కూడా పాలేరు, కొత్తగూడెం టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. దాంతో పాలేరు సీట్ ఎవరికీ దక్కుతుందో తెలియని పరిస్థితి. కమ్యూనిస్టులను కాదని పాలేరు తుమ్మలకు కేటాయిస్తే కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించే అవకాశం లేదు. అదే జరిగితే మరో నాలుగైదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నట్లు అవుతుంది.
వీటన్నింటిని పరిశీలించిన కాంగ్రెస్ తుమ్మలను ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరే అవకాశం ఉంది. కమ్మ సామజిక వర్గానికి చెందిన తుమ్మలకు ఖమ్మంలో పట్టుంది. అక్కడ కమ్మ సామజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువే. అందుకే తుమ్మలను కన్విన్స్ చేసి పాలేరు నుంచి కాకుండా ఖమ్మం బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఆరునూరైన పాలేరు బరిలో ఉంటానని స్పష్టం చేశారు. దీంతో తుమ్మల ఎం చేస్తారనేది ఉత్కంట నెలకొంది.
Also Read : నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ – కవిత కోసమే కామారెడ్డి నుంచి పోటీ..?