కాంగ్రెస్ షరతులకు వైఎస్ షర్మిల ఎట్టకేలకు అంగీకరించడంతో వైఎస్సార్టీపీ విలీన ప్రక్రియలో కదలిక పునః ప్రారంభమైంది. తెలంగాణ విడిచి ఏపీలో రాజకీయాలు చేసేందుకు మొదట నిరాకరించిన షర్మిల తరువాత కాస్త మెత్తబడింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంతోపాటు ఏపీలో కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేస్తానని షర్మిల అంగీకరించింది. దీంతో షర్మిలను మెల్లగా ఏపీకి పరిమితం చేయడం ఎలాగో తెలిసిన కాంగ్రెస్ , వైఎస్సార్ టీపీ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జూలైలోనే వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ లో విలీనం ప్రక్రియ పూర్తి అవుతుందని అనుకున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె అవసరం తెలంగాణకు లేదని ఏపీలో రాజకీయం చేస్తామంటే తమకు ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పేశారు. ఇదే విషయాన్ని హైకమాండ్ పెద్దలు షర్మిలకు చెప్పగా ఏపీలో రాజకీయం చేయడంపై షర్మిల ఆలోచనలో పడిపోయారు. దాంతో విలీనం ప్రక్రియ నిలిచిపోయింది.
షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోకపోవడంతో చివరికి షర్మిలనే వెనక్కి తగ్గారు. తెలంగాణలో పోటీ చేస్తాను..అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని షర్మిల చెప్పినట్లు తెలుస్తోంది. చివరికి పన్నెండో తేదీన విలీన ముహుర్తం ఖరారు చేసుకున్నారని అంటున్నారు. అయితే, ఆమె తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారా..? లేక పాలేరు బరిలో ఉంటారా..? అన్నది చర్చనీయంశంగా మారింది.
Also Read : కేసీఆర్ కు బిగ్ షాక్ – డేంజర్ జోన్ లో 49మంది ఎమ్మెల్యేలు..?