తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ స్టానంలో ఈటెల రాజేందర్ని నియమించే యోచనలో కేంద్రం పెద్దలు ఆలోచనలో ఉన్నట్లు విశ్వాసనీయ వర్గాలద్వార తెలిసింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కేంద్ర బిజెపి ఆశించినంత స్టాయిలో బండి నుంచి ఫలితాలు రావడం లేదని వాళ్లు రహస్యంగా చేపట్టిన సర్వే ఫలితాలు తేల్చాయి. మరో ఏడు నెలల్లో తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎలాగైనా 90 సీట్ లు గెలవాలని ‘మిషన్ 90’ ఆపరేషన్ మొదలు పెట్టింది కేంద్రం.
ఇది అంత తేలిక కాదు. అందుకే కేంద్రం ఓ ప్రణాళిక తాయారు చేసి బండి మీద మోపింది. అందులు భాగంగా ఇప్పటికే 12౦౦౦ బ్లాక్ స్టాయిలో మీటింగ్ లు జరిపి ప్రతి ఐదు లేదా ఆరు గ్రామాలకు ఒక డివిజన్ చొప్పున కింది స్టాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి. కింది క్యాడర్ చాలా బలంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ తో పోల్చితే బిజెపి 80 శాతం వెనుకబడి ఉంది. అందుకే బండి ఇప్పటివకు 6 వేల లోపే మిట్టింగ్ లు ఏర్పాటు చేయగలిగారు.
కానీ ఆశించిన స్టాయిలో కొత్త కార్యకర్తలు పార్టీలో చేరడం లేదు. అల్లాగే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లల్లో ఉన్న రెబల్స్, నిరాశావాదులు, అసంతృప్తి వాదులను తమ పార్టీలో చేర్చుకోలేక పోయారు బండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి రెబల్ నాయకులను ఇంకా బిజె పిలోకి లాక్కోపోలేక పోయారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ని కూడా ఇంకా బిజెపి లోకి తిసుకోలేకపోయారు. దీనికి తోడూ ఈసారి సిట్టింగ్ ఏమ్మేల్లకే పార్టీ టికెట్లు ఇస్తున్నట్లు కెసిఆర్ కుండబద్దలు కొట్టారు. ఇది గొప్ప అవకశం. పార్టీలో ఉన్న కింది స్టాయి నాయకులను కూడా ఇంకా బిజెపిలోకి చేర్చుకోలేదు.
దానికి తోడూ మొన్న ‘ఎమ్మేల్లెలా కొనుగోలు’ కేసులో కెసిఆర్ ఎత్తుకు పై ఎత్తు వేయలేక అడ్డంగా పార్టీని ఇరికించారు. కనీసం దానిని అడ్డదారి పట్టించలేకపోయారు. అసలు కెసిఆర్ ముందు ఆనడం లేదు. ఆంజనేయుడి ముందు కుప్పి గంతులు వేసున్నారు.
ఇక బండి చేపట్టిన పాద యాత్రలో కూడా జనం ఆశించినంతగా రావడం లేదు. పార్టీ కార్యకర్తలే దర్శనమిస్తున్నారు. అసలు ఓటర్లు రావడం లేదు. పైగా బండి ‘ పాడిందే పాడరా పాచుపల్ల దాసరి’ అన్నట్లు ఒకే ప్రసంగాని తిప్పి తిప్పి చెపుతున్నాడు. కెసిఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. కానీ కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో విఫలం అవుతున్నాడు. బిజెపి కొత్త పథకాలు ప్రజలకు చెప్పలేక పోతున్నారు. తెలంగాణాకు కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజల్లోకి తీసుని వెళ్ళడంలో విఫలం వవుతున్నారు.
పైగా అతని కొడుకు బండి భగిరత్ చేసిన ర్యాగింగ్ కేస్ ని ప్రతిపక్షాలు చక్కగా వాడుకుని జనాల్లోకి తీసుకుని వెళ్ళాయి. ఇది బిజెపి కి చావు దెబ్బ కొట్టింది.
ఇలాగే ఉరుకుంటే ఏడు నెలల్లో ‘మిషన్ 90’ విజయవంతం అయ్యేలా లేదు. అందుడే అమిత్ షా తెలంగాణాకు రాగానే బండికి ఉద్వాసన చెప్పి ఈటెలకు పగ్గాలు ఇవ్వ వచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బండి ని కేంద్ర మరోలా వాడుకునే అవకాశం ఉంది.
౦౦౦