ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడి నుంచి సమన్లు అందుకున్న ఎం ఎల్ సి కవిత ఈ రోజు అరెస్ట్ కావొచ్చు అనే ఉహాగానాలు ఊపందుకున్నాయి. అందుకే నిన్న రాత్రి కేటిఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి హుటాహుటినా న్యూ ఢిల్లీ కి పరుగెత్తారు. నిజానికి వాళ్ళకు అటు ప్రధాని అపాయింట్మెంట్ లేదు, అమిత్ షా అప్పాయింట్మెంట్ కూడా లేదు. అయినా వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాయలని ఇద్దరు ఢిల్లీ కి వెళ్లి బయలుదేరారు.
ఎందుకంటే, ఈరోజు ఈడి విచారణలో కవిత నుంచి సంతృప్తికరమైన జవాబులు రాకపోతే వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దంగా ఉంది. మొన్న అరెస్ట్ అయ్యిన పిళ్ళై ద్వారా ఇప్పటివరకు లేని కొత్త ఆధారాలు ఈడికి లభించాయి. మునుపులేని ఉత్సాహం ఇప్పుడు ఈడిలో, బిజెపిలో వచ్చింది. జాతీయ పార్టీగా ఎదగాలి అనుకునే బిఆర్ఎస్ ని ఆదిలోనే అన్ని విధాలుగా చావు దెబ్బ కొట్టాలనే బిజెపి పన్కునిన కుట్రకు ఇప్పుడు రెక్కలు వచ్చాయి. ఈ దెబ్బతో బిఆర్ఎస్ ని తెలంగాణాలో ఓడించి, తాను కైవసం చేసుకోవాలన్నది బిజెపి ప్రధాన ఎజెండా.
నాలుగు రోజుల కిందట ఈడి కవితకు సమన్లు పంపి ఈ నెల్ 9వ తేదిన విచారణకు రావాలని ఆదేశించింది. ఈడి పంపిన నోటీసులో తక్కువ సమయం దొరికింది. ఇక చక్రం తిప్పలేమని తెలిసిన కవిత కావాలని సమయం తీసుకుని ఈ నెల 11 న విచారణకు హాజరు అవుతానని ఈడి ని కోరారు. దానికి ఆమె ‘మహిళా రిజర్వేషన్’ ఆందోళనలో బిజీగా ఉన్నానని ఓ కుంటిసాకు చూపారు.
కానీ కెసిఆర్ హైదరాబాద్ లో ఉంది న్యూ ఢిల్లీ లో చేసిన మంత్రాంగం బెడిసి కొట్టింది. అందుకే కేటిఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి హుటాహుటినా న్యూ ఢిల్లీ కి పరుగెత్తారు.
కేటిఆర్, హరీష్ రావు ఇద్దరు ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి బిజెపితో లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు అతోపిస్తున్నారు. బిఆర్ఎస్, బిజెపి మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని కాంగ్రెస్ మొదటినుంచి బలంగా ఆరోపిస్తోంది. ఇప్పుడు అది బహిర్గతం అవుతోంది.
ఇద్దరి లోపాయికారీ ఒప్పందాలు కుదిరితే ఈడి విచారణ తర్వాత కవిత క్లీన్ చీట్ తో బయటికి వసారు. ఒకవేళ లోపాయికారీ ఒప్పందాలు కుదరకపోతే ఆమె అరెస్ట్ అవుతారు. ఈ రోజు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలో మొదలయ్యింది. నేడే విడుదలైన ‘కవిత అరెస్ట్’ లిక్కర్ స్కాం సినిమా హిట్టా, ఫట్టా చూడాలి.
కవిత అరెస్ట్ అయ్యితే ఏం జరుగుతుంది?
ఒకవేళ కవిత అరెస్ట్ అయితే బిఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా ఆనోళనలు చేయిస్తుంది. అధికార దుర్వినియోగానికి పాల్పాడి రాస్తా రోకోలు, బస్ రోకో, రైల్ రోకో లాంటి కార్యక్రమాలు చేప్పటి ప్రజలను ఇబ్బంది పెడుతుంది. దీనివలన అటు మోడీకి, ఇటు బిజెపి కి వచ్చే నష్టం ఏమిలేదు. నష్టం మొత్తం ప్రజలకే. బిఆర్ఎస్ ని ఎన్నుకున్న పాపానికి ప్రజలు ఇలాంటి పాట్లు పడక తప్పాడు. కవిత కడిగిన నిప్పు అని చెప్పడానికి చూస్తారు. అసంబ్లీ సమావేశాలు రద్దు చేస్తారు.
కవిత అరెస్ట్ కాకపోతే ఏం జరుగుతుంది?
కేటిఆర్, హరీష్ రావు కలిసి ఈ రోజు బి జె పితో కుదుర్చుకునే లోపాయికారీ ఒప్పందాలు తెరమీదికి వస్తాయి. మజ్లిస్ట్ తో ఉన్న దోస్తీ కటీఫ్ చేసుకుంటుంది. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలలో మాత్రమే బిఆర్ఎస్ పోటీ చేస్తుంది. మోడీని తిట్టడం మానుకుంటారు. కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుంది.