తెలంగాణ కాంగ్రెస్ అధికారం లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. జిల్లాలవారీగా పార్టీలో చేరికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంతో నేతలను పార్టీలో చేర్చుకున్నారు. పొంగులేటి, తుమ్మల చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు తిరుగులేకుండా పోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ చేరికలు స్టార్ట్ అయ్యాయి. జిట్టా బాలకృష్ణారెడ్డితోపాటు ఇటీవల కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. వేముల వీరేశం చేరిక వాయిదా పడుతోంది. 29న వీరేశం కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ తన సొంత జిల్లా పాలమూరుపై దృష్టి కేంద్రీకరించారు.
పాలమూరు జిల్లాలో 14స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసంపార్టీ నేతల సమన్వయముతో రేవంత్ ప్రత్యర్ధి పార్టీలో బలమైన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త రిపోర్ట్ మేరకు ప్రత్యర్ధి పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. గెలుపు గుర్రమని రిపోర్ట్ ఇచ్చిన వెంటనే రేవంత్ చర్చలు ప్రారంభిస్తున్నారు. టికెట్ పై అగ్రనేతలతో హామీ కూడా ఇప్పిస్తున్నారు. కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపు గుర్రంగా ఉన్నారని.. అక్కడ వంశీచంద్ రెడ్డికి గెలుపు చాన్స్ లేవని ఎస్కే రిపోర్ట్ తో కసిరెడ్డితో రేవంత్ చర్చలు ప్రారంభించారు. కాంగ్రెస్ లోకి రావాలని వంశీచంద్ తో కలిసి ఆహ్వానించారు. నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ తోనూ చర్చలు కొనసాగుతున్నాయి.
Also Read : కల్వకుర్తిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కసిరెడ్డి..!!
ఇలా ఒక్కొక్కరిని రేవంత్ చాకచక్యంగా కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నారు. ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ పై కన్నేయడంతో పాలమూరులోనూ ఆ తరహ ఫలితం రాబట్టాలని రేవంత్ చేరికలను స్పీడప్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్క జిల్లాలో ప్రణాళిక బద్దంగా సాగుతు సక్సెస్ అవుతున్న రేవంత్ పాలమూరు జిల్లా తరువాత ఏ జిల్లాను ఎంచుకుంటారో చూడాలి. ఇప్పటివరకు మూడు జిల్లాలో తనదైన శైలిలో రాజకీయం చేస్తూ నేతలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చిన రేవంత్.. నెక్స్ట్ ఏ జిల్లాను ఎంచుకుంటారు..? ఎలాంటి ఫలితం రాబడుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మూడు జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్నాయి కనుక కాంగ్రెస్ లో నేతలను జయిన్ చేయడంలో రేవంత్ ఈజీగా సక్సెస్ అయ్యారు. కానీ మిగతా జిల్లాలో ప్రస్తుతం కొంత బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉంది. దానిని అధిగమించి కాంగ్రెస్ ను రేసులోకి తీసుకోచ్చేందుకు బలమైన నేతలకు ఎలా వల విసురుతారో.? ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. మిగతా జిల్లనూ ఇదే తరహాలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ విజయం నల్లేదు మీద నడకేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : సీన్ రివర్స్ – కేసీఆర్ టైం బ్యాడ్ ..!!