బీజేపీలో ఇమడలేకపోతున్న ఈటల రాజేందర్ ను తిరిగి టీఆర్ఎస్ లో చేరాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో తిరిగి చేరితే టీఆర్ఎస్ లో నెంబర్ 2హోదా కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. కేసీఆర్ ఆహ్వానం పట్ల ఈటల అనాసక్తి చూపించారని..దాంతోనే తాజాగా ఆయనకు దేవరయంజాల్ భూముల విషయంలో ఉచ్చు బిగించారని అంటున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల…బీజేపీకి ట్రంప్ కార్డు అయ్యారు. దాంతో బీజేపీ సీఎం క్యాండిడేట్ ఆయనేననే అంత అనుకున్నారు. ఒకానొక దశలో బీజేపీ అద్యక్ష బాధ్యతలను ఈటలకు అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కాని ఆయనను కొంతకాలం పట్టించుకోకుండా పక్కన పెట్టేయడంతో ఈటల అసంతృప్తిని గుర్తించిన అధిష్టానం ఆయన్ను చేరికల కమిటీ చైర్మన్ గా నియమించింది. తొలుత చేరికల విషయంలో ఈటల దూకుడుగా వ్యవహరించినా బండి సంజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యల వలన ఈటల సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో గతంలో తీవ్రంగా అవమానించిన పార్టీలోకి ఏమోహం పెట్టుకొని ఈటల వెళ్తాడని అందరూ సందేహిస్తున్నారు.
కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ను ఈటల కాదనడటంతోనే..దేవరయంజాల్ భూములపై ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చి ఉంటుందన్న వాదనలు వినిపిస్తునాయి. అవన్నీ అసైన్డ్ భూములేనని వాటిని వెనక్కి తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు. ఈటలతో కేసీఆర్ టచ్ లోకి వెళ్ళారన్న ప్రచారం బయటకు పొక్కిన మరుసటి రోజే ప్రభుత్వ కమిటీ నివేదిక ఇవ్వడం గమనార్హం. అదే సమయంలో ఈ వార్తలు వెలుగులోకి వచ్చిన తరువాత హైకమాండ్ నుంచి ఈటల కు పిలుపు రావడం కూడా అనేక అనుమానాలకు కారణం అవుతోంది.