ఆట అంటే గెలుపు ఓటములు సర్వసాధారణం. అందులో క్రికెట్ కూడా ఒకటి. క్రికెట్లో టి 20 లో గెలుపును ఎంతగా ఎంజాయ్ చేస్తారో, ఓటమిని కూడా అంతే స్టాయిలో ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. అందుకే క్రికెట్లో టి 20 కోసం ఐ పి ఎల్ అనే ఓ విభాగమే ఏర్పడింది.
ఓడిపోవడం వేరు. అతి దారుణంగా ఓడిపోవడం వేరు. చావు దెబ్బతో ఒడిపొతే ఇక లేవడం దాదాపు అసాధ్యం. ఇక్కడ సన్ రైసర్స్ హైదరాబాద్ విషయంలో అదే జరిగింది.
ఆదిలోనే హంసపాదు అన్నట్లు నిన్న ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన టి 20లో అతి దారుణమయిన ఓటమిని మూటగట్టుకుంది. 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంటే రన్ రేట్ అతి దారుణంగా పడిపోయింది.
ఇకమీద ఏ టీం మీద మనవాళ్ళు గెలిచినా, సెమి ఫైనల్ కి వెళ్ళాలంటే ఇక రన్ రేట్ బాగా పెంచుకోవాలి. గత నాలుగు సీజన్లుగా చూస్తే అన్ని టీంలు 5 నుంచి 20 రన్ ల మధ్యనే గెలుపు, ఓటములు నిర్ణయించబడుతున్నాయి. కానీ 50 పరుగుల తేడాతో గెలిచిన టీం లు చాలా అరుదు.
కాబట్టి సన్ రైసర్స్ హైదరాబాద్ ఇకపై 40 నుంచి 50 పరుగుల తేడాతో కనీసం నాలుగు మ్యాచ్ లు గెలిస్తే కానీ ఈ రన్ రేట్ లోటును భర్తీ చేసుకోలేదు. ఇది ఎంతవరకు సాధ్యం? అన్ని టీంలు చాలా బలంగా ఉన్నాయి. వాటి మీద గెలువడమే గగనం. ఇక భారీ విజయం నమోదు చేసుకోవడం ఎంతవరకు సాధ్యం?
సన్ రైసర్స్ హైదరాబాద్ అంటేనే మొదటి నుంచి బోల్లింగ్ కి మంచి పేరుంది. సన్ రైసర్స్ హైదరాబాద్ మీద 150 పరుగులు చేయడం అంటేనే కష్టం అనే పేరు ఒకప్పుడు ఉండేది. 130 లోపు పరుగులతో తెలిచిన బౌలింగ్ విభాగం మనకు ఉంది. అలాంటిది గొప్ప టీం మీద రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 20౩ పరుగులు చేయడం మన బలహీనతను చాటుతోంది.
పైగా భువనేశ్వర్ కుమార్ సారథ్యంలో ఇన్ని పరుగులు ఇవ్వడ ఘోర ప్రభావం. అందులోను రాజస్తాన్ రాయల్స్ టీం లోని ముగ్గుడు బాట్స్ మెన్ లు వరుసగా అర్థ సెంచరిలు కొట్టి కొత్త రికార్డ్ నెల కొల్పడం బాధాకరం. టి 20 చరిత్రలో ఇలా ముగ్గురు బాట్స్ మెన్ అర్థ సెంచరిలు కొట్టడం ఇది నాలుగోసారి. అంటే సన్ రైసర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం ఎంత దీనస్తితిలో ఉందో అర్హం చేసుకోవచ్చు.
తొలిసారి భువనేశ్వర్ కుమార్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 16వ సీజన్ ను దారుణ ఓటమితో ప్రారంభించింది. అది కూడా సొంతగడ్డపై ఈ పరాభవం ఎదురైంది. 20 – ౩౦ పరుగులతో ఓడిపోతే ఇంత బాధ ఉండేది కాదు.
టాస్ గెలిచిన సన్ రైజర్స్ ముందు బౌలింగ్ ఎంచుకోవాడలో పొరపాటుల పరంపర మొదలయ్యింది. మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తారు అని అందరు అనుకున్నారు. కానీ భువి బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నాడో ఎవ్వరికీ అర్థంకానీ విషయం. ఆ తప్పుడు నిర్ణయం బెడిసికొట్టింది. రాజస్థాన్ బ్యాటర్లు చెలరేగి పోయారు. పిచ్ బాటింగ్ కు చాలా అనుకూలంగా ఉందని తెలిసింది. పర్వాలేదు. మనవాలు కూడా బ్యాట్ దులిపిస్తారు అనుకున్నారు.
కానీ 204 పరుగుల భారీ లక్ష్యఛేదనలోనూ సన్ రైజర్స్ కు ఆది నుంచి ఎదురుదెబ్బలే! మొదటి ఓవర్ లోనే బోల్ట్ ఇద్దరు ఓపనర్ లను డక్ అవుట్ చేయడం ఏమిటి? ఓపెనర్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి ఖాతా కూడా తెరవకుండానే డకౌట్ అయ్యారు. ఎంత దారుణం? 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. అది కూడా అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ జోడీ ఆఖరి ఓవర్లో 23 పరుగులు బాదడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 27 పరుగులు చేయగా, ఖరీదైన ఆటగాడు హ్యారీ బ్రూక్ 13 పరుగులు చేసి నిరాశపరిచాడు. కోట్లు ధారపోసి కొన్న ఈ ఆటగాళ్ళు కనీసం 35 పరుగులు కూడా చేయకపోవడం ఏమిటి? వాషింగ్టన్ సుందర్ (1), గ్లెన్ ఫిలిప్స్ (8) విఫలం. అదిల్ రషీద్ 18 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ పోరాటం కనబర్చి 32 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఉమ్రాన్ మాలిక్ 19 నాటౌట్. ఉమ్రాన్ మాలిక్ 8 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 2 సిక్సులు కొట్టాడు. కానీ ఏం లాభం? అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది.
ఉప్పల్ స్టేడియం బౌలర్లకు ఏ మాత్రం అనుకూలంగా ఉండదు. అయినా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 4 వికెట్లు తీయడం విశేషం. ట్రెంట్ బౌల్ట్ 2, జాసన్ హోల్డర్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు. ఇది కాదు మన సన్ రైసర్స్ హైదరాబాద్ టీం. ఏమో అయ్యింది. ఏంటది?