ఇటీవల ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ తో భేటీ తరువాత మెత్తబడిన మాజీ ఎంపీ బూర నర్సయ్య అనూహ్యంగా ప్లేట్ ఫిరాయించడం వెనక ఎం జరిగింది..?అసలు ప్రగతి భవన్ లో బూరతో కేసీఆర్ ఎం మాట్లాడారు..? కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిన మూడు రోజుల వ్యవధిలోనే బూర నర్సయ్య కూడా హస్తినలో కనిపించడం వెనక దాగిన సీక్రెట్ ఏంటి..? ఢిల్లీ వెళ్ళిన తరువాత బీజేపీ నేతలను కలిసే ముందుగా బూరతో కేసీఆర్ ఎందుకు టచ్ లోకి వెళ్ళారు..? కేసీఆర్ సూచన మేరకే జేపీ నడ్డాను బూర నర్సయ్య కలిశారా ..? లెట్స్ వాచ్ దిస్ స్టొరీ
మాజీ ఎంపీ బూర నర్సయ్య బీజేపీలో చేరాలని తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. ఇటీవలే ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమైన బూర నర్సయ్య మునుగోడులో కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించి, అనూహ్యంగా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం వెనక లిక్కర్ స్కాం ఉదంతం ఉందని తెలుస్తోంది. కేసీఆర్ తో సమావేశమైన బూర నర్సయ్యతో తాను త్వరలో ఢిల్లీ వెళ్తున్నానని.. అక్కడ కలిసి కుదురుగా మాట్లాడుకుందామని కేసీఆర్ అన్నారట. నీ రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని తాను అండగా ఉంటానని భరోసా కూడా ఇచ్చారట. కేసీఆర్ ఢిల్లీ షెడ్యూల్ ముందే ఖరారు కాగా..ములాయం అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా హస్తిన వెళ్ళారు. ఇక కేసీఆర్ సూచన మేరకు ఢిల్లీ వెళ్ళిన బూర నర్సయ్య అక్కడ గులాబీ బాస్ ను కలిసేందుకు ప్రయత్నించగా ఇంటికి రావాలని కేసీఆర్ కబురు పంపగా… ఇరువురి భేటీ సందర్భంగా కేసీఆర్ మాటలు విని బూరకు మైండ్ బ్లాక్ అయిందట.
డాక్టర్ సాబ్…లిక్కర్ స్కాంలో బీజేపీ ఎలా దూకుడుగా వెళ్తుందో నీకు తెలియనిది కాదు… ఈ విషయంలో కవిత హస్తం ఉండటంతో నా కూతురిని అరెస్ట్ చేసేందుకు అమిత్ షా ఈడీతో ఎలాంటి ప్రయత్నాలు చేయిస్తున్నాడో నీకు కూడా తెలుసు. కాబట్టి..మునుగోడులో ఓటమికి అంగీకరించే వ్యూహంలో భాగంగా నిన్ను కాదని కూసుకుంట్లకు టికెట్ ఇచ్చాం..నీ మనస్సు బాధపెట్టామని తెలుసు.. కాని తప్పలేదు..మునుగోడులో బీజేపీ గెలవకపోతే నా కూతురుకే కాదు.. పార్టీలోని బడా నేతలందరికీ ప్రమాదమే. దీనిని గుర్తించే మునుగోడులో ఓటమికి అంగీకరించాం. అయితే, అక్కడ కేంద్ర ఇంటలిజెన్స్ చేసిన సర్వేలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దాంతో బీజేపీ హైకమాండ్ నుంచి ఓ బీసీ నేతను పార్టీలోకి పంపించాలని ఆదేశాలు ఉన్నాయి. లేదంటే మునుగోడు ఉప ఎన్నిక తరువాత కవితను లిక్కర్ స్కాంలో జైలుకు పంపుతామంటున్నారు. నువ్వే పెద్ద మనస్సు చేసుకొని బీజేపీలో చేరాలని కేసీఆర్ చెప్పడంతో బూరకు మతి పోయిందట.
నువ్వు అంగీకరిస్తే బండి సంజయ్ కూడా రేపు ఢిల్లీ రానున్నారు. సంజయ్ తో భేటీ అవ్వు.. ఆ తరువాత జేపీ నడ్డా దగ్గరికి తీసుకెళ్ళి కలిపిస్తారు.. ఆ తరువాత మిగతాదంతా నేను చూసుకుంటానని హామీ ఇచ్చాడట కేసీఆర్.. ఇలా ఒప్పందంలో భాగంగానే బూర నర్సయ్య మనస్సు చంపుకొని పార్టీ మారడని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ కు రాజీనామా లేఖలో మనస్సు చంపుకొని పార్టీ మారుతున్నట్లు నర్సయ్య పెర్కొండటం ఈ వార్తకు బలం చేకూర్చేదిలా ఉన్నది.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.