ఇటీవలి ఇండియా టుడే- సీవోటర్ సర్వేలో మరోసారి బీజేపీకి పట్టం కట్టనున్నారని తేలింది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం ఏర్పాటు చేస్తుందని వెల్లడైంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే 284సీట్లు బీజేపీకి వస్తాయని సర్వేలో తేలిందని చెప్తున్నారు.
నిజమే.. కానీ పెరిగిన కాంగ్రెస్ , మిత్రపక్షాల గ్రాఫ్ గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదు. విపక్షాలతో కలిసి కాంగ్రెస్ కు 191 సీట్లు వస్తాయని ఇండియా టుడే- సీవోటర్ సర్వేనే తేల్చింది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ కు 139 సీట్లు పెరుగుతున్నాయి. కాని ఈ రిజల్ట్ ను ఎక్కడ ప్రస్తావించకుండా… బీజేపీ ప్రభంజనం అని మెయిన్ స్ట్రీం మీడియా మొదలు పలు వెబ్ సైట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి.
బీజేపీ ప్రభంజనం అంటున్నారు. నిజానికి ఈ వ్యాక్యం సరిపోతుందా..? అంటే సెట్ కాదనే చెప్పాలి. ఎందుకంటే.. గతంలో బీజేపీ 303 స్థానాల్లో గెలుపొందింది. మోడీ హవా ఉంటె ఈసారి ఆ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి. కాని ఇదే సర్వేలో గతంలో కంటే బీజేపీకి ఈసారి 19సీట్లు తగ్గుతున్నాయని తేలింది. కాంగ్రెస్ తోపాటు విపక్షాలు బలహీనపడితే.. బీజేపీకి సీట్లు పెరగాలి. కాని సీట్లు తగ్గుతున్నాయంటే బీజేపీ బలహీనతకు సంకేతమే కదా..! అది మోడీ హవాకు, ప్రభంజనంకు నిదర్శనం ఎలా అవుతుంది..?
Also Read : బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందా – తేల్చనున్న 2023
ఈ విషయం దాచి బీజేపీ బలపడుతుందని.. మోడీ అభివృద్ధి, అవినీతిరహిత పాలనే మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకొస్తుందని ఏదేదో మాట్లాడుతున్నారు. మాసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం అన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని చేస్తున్నాయి. అమాయక జనాలను మభ్యపెట్టే ప్రయత్నంలో మీడియా సంస్థలు విజయవంతం అవుతున్నాయి.