ఇటీవలే మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. మౌనికకు ఐదేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. ఇక నుంచి బాబు బాధ్యత కూడా తనదేనని మనోజ్ స్పష్టం చేశాడు. అయితే.. భూమా మౌనికతో మంచు మనోజ్ కు పరిచయం ఎలా ఏర్పడింది.? వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఏంటనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది.
మౌనిక రెడ్డి తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీలో బ్రాడ్ కాస్టింగ్ జర్నలిజంలో చేరింది. మనోజ్ కూడా అదే అకాడమిలో యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఈ అకాడమిలోనే మౌనిక – మనోజ్ లకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. కాని ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోలేదట. ఇక అదే సమయంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి కుదిరించిన పెళ్లి మౌనిక చేసుకుంది.
బెంగళూర్ కు చెందిన గణేష్ రెడ్డిని వివాహం చేసుకున్నాక మొదట్లో సాఫీగానే ఉన్నా.. తరువాత మౌనిక విషయంలో ఆంక్షలు విధించేవాడట గణేష్. మనోజ్ లాంటి వారితో క్లోజ్ గా మూవ్ కావడంపై అభ్యంతరం చెప్పేవాడట. ప్రతిదానికి అనుమానించడంతో గణేష్ తో విడిపోయేందుకు మౌనిక సిద్దమైందట.
అతనితో విడిపోయిన తర్వాత మనోజ్ ఆమెకి మరింత దగ్గరయ్యాడట. మానసికంగా ఆమెకి మద్దతుగా నిలిచాడని, ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని.. అది తాజాగా కార్యరూపం దాల్చిందని ఒక కథనం ప్రచారం అవుతుంది.
Also Read : హీరో విశాల్ గుండెలపై టాటూ – ఎవరిదో తెలుసా..?