మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “వాల్తేరు వీరయ్య ” శుక్రవారం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. ఈ మూవీ ద్వారా మెగాస్టార్ లో నున్న టైమింగ్ ను బయటకు తీసానని చెప్పిన డైరక్టర్ బాబీ నిజంగా ఆ పని చేశాడా..? చాన్నాళ్ళ తరువాత చిరు ఖాతాలో భారీ హిట్ పడబోతుందన్నది నిజమేనా..? అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.
కథ : జాలరిపేటలో ఉండే వీరయ్య(చిరంజీవి) ఆ పేటకు పెద్ద మనిషి. ఆ పేటలోని వీరయ్య మాటను ఎవరూ జవదాటరు. ఆయన ఏది చెప్తే అది చేసేస్తారు. ఆయన అంటే ఆ పేట వాసులకు విపరీతమైన అభిమానం ఉంటుంది. అయితే, వీరయ్యతోనే ఉంటూ కొంతమంది ఆయనకు తెలియకుండా డ్రగ్స్ దందా చేస్తారు. విషయం తెలుసుకున్న ఏసీపీ విక్రమ్ సాగర్ ( రవితేజ) పేటకు వెళ్లి డ్రగ్స్ సరఫరా చేస్తోన్న వాళ్ళను అరెస్ట్ చేస్తారు. తమ వాళ్లకు ఏ పాపం తెలియదని జాలరిపేటకు చెందిన వారిని అరెస్ట్ చేస్తుంటే వీరయ్య అడ్డుకోబోతాడు. దాంతో వీరయ్యను కూడా అరెస్ట్ చేస్తారు. ఇక్కడే డైరక్టర్ కథలో పదును చూపిస్తాడు. చిరంజీవి , విక్రమ్ సాగర్ ఎవరో కాదు. ఒకే తండ్రి బిడ్డలు. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం ఉన్నప్పటికీ పైకి ప్రదర్శించరు. పరిస్థితుల వలన ఇద్దరి మధ్య విబేధాలు వస్తాయి. వీరయ్య జైలులో ఉండగానే విక్రమ్ సాగర్ ను విలన్స్ మోసపూరితంగా చంపుతారు. తన తమ్ముడి చావుకు కారణం ఎవరని తెలుసుకున్న చిరంజీవి.. ప్రకాష్ రాజే హత్య చేయించాడని అతను ఉన్న చోటుకు వెళ్లి ఆ తరువాత ఎం చేస్తాడనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ : ఈ సినిమా ద్వారా వింటేజ్ మెగాస్టార్ ని బయటకి తీస్తానని చెప్పిన దర్శకుడు బాబీ అన్నట్టుగానే చేసి చూపించాడు.చిరులోని మునుపటి కామిడి టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కామెడితో ఎంత నవ్విస్తాడో ఎమోషనల్ సన్నివేశాలో చిరంజీవి తన నటనను మరోసారి చూపించాడు. మెగాస్టార్ కు తగ్గ మ్యూజిక్ ఇచ్చే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం మంచి మ్యూజిక్ ను కంపోజ్ చేశాడు. పాటలన్నీ సూపర్ అనిపిస్తాయి. రవితేజ ఎంట్రీ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి.రవితేజ పాత్ర చిన్నదే అయినా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేవిధంగా చూపించాడు.
కథానాయికగా నటించిన శృతి హసన్ కూడా సీబీఐ ఆఫీసర్ గా అదరగొట్టేసింది. ప్రకాష్ రాజ్ , బాబీ సింహతో సహా అందరూ బాగా నటించారు. సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాంటి సినిమాను అయితే కోరుకుంటారో అలాంటి సినిమానే ఇచ్చాడు దర్శకుడు బాబీ. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ అంత కలిసి చూడాలనిపించే సినిమా. కాబట్టి ఈ సంక్రాంతి చిరంజీవిదేనని చెప్పొచ్చు.
చివరి మాట : మెగా అభిమానులకు బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. చూడాల్సిన సినిమా.
రేటింగ్ : 3/5
Also Read : వీరసింహ రెడ్డి రివ్యూ