తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ లో విడుదల కానుంది. ఈలోపే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసి ఎన్నికల రేస్ ను స్టార్ట్ చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం తామేమి తక్కువ తినలేదనే రేంజ్ లో దూసుకుపోతోంది. ఎందుకంటే.. ఆ పార్టీలోకి కీలక నేతలు చేరుతుతున్నారనేది ఇందుకు ప్రధాన కారణం. మాజీ ఎంపీ గడ్డం వివేక్ కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
వివేక్ సోదరుడు గడ్డం వినోద్ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన బెల్లంపల్లి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ ను వివేక్ ఆశిస్తున్నారని టికెట్ పై హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరేందుకు వివేక్ సంసిద్దంగా ఉన్నారని టాక్. అదే సమయంలో ఈటల రాజేందర్ పేరు కూడా వినిపిస్తోంది. బీజేపీ – బీఆర్ఎస్ ఒకటి కాదని జనాలకు ఎంత చెబుతున్నా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం లేదు. ఈ అనుమానాలు జనాల్లో ఉండగా కేసీఆర్ ను గద్దె దించడం సాధ్యం కాదు. అందుకే కాంగ్రెస్ లో చేరితే కేసీఆర్ ను మట్టి కరిపించవచ్చుననే ధోరణితో ఈటల ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో ఉండేది అనుమానమే. కొంత అసంతృప్తిగానే ఉన్నారు. బీజేపీలోనే కొనసాగుతున్నట్లు చెబుతున్నా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కవితపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో రెండు పార్టీల మధ్య మైత్రి కుదిరిందనే భావనతో స్వయంగా బీజేపీ నేతలే ఉన్నారు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ను ఓడించేందుకు మళ్ళీ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
తుమ్మల నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ ను వీడెందుకు రెడీ అయ్యారు. పాలేరు టికెట్ నిరాకరించడంతో బీఆర్ఎస్ తో బంధాన్ని తెంచుకునేందుకు తుమ్మల ఆసక్తి చూపుతున్నారు. కానీ ఆయన పార్టీని వీడకుండా చూడాలని హరీష్ రావుకు కేసీఆర్ టాస్క్ అప్పగించారు. రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కానీ ఆయన మాత్రం ఎమ్మెల్యే టికెట్ కోసమే పట్టుబట్టే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ లో తనకు , తన కుమారుడికి టికెట్ కావాలని బెట్టు చేస్తున్నారు మైనంపల్లి హన్మంతరావు. బీఆర్ఎస్ నుంచి ఇంకా సానుకూలత రాకపోవడంతో కాంగ్రెస్ ఆయనను ఆహ్వానిస్తోంది. రెండు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందని గాంధీ భవన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కి అధికారంలోకి వచ్చేలా సానుకూల పరిణామాలు కనిపిస్తుండటంతో బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Also Read : బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కీలక నేతలు..?