బీజేపీ నేత తూళ్ళ వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో కలిసి ఆయన బుధవారం ఢిల్లీ వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతున్న నేపథ్యంలో మధుయాష్కీతో కలిసి వీరేందర్ గౌడ్ హస్తినకు వెళ్ళడం ఆసక్తికరంగా మారింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీరేందర్ గౌడ్ ఏఐసీసీ నేతలను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులోగా లేదా అక్టోబర్ లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్ళడంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇటీవల దేవేందర్ గౌడ్ ను రేవంత్ రెడ్డి కలిసి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వీరేందర్ గౌడ్ కాంగ్రెస్ నేతలతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
వీరేందర్ గౌడ్, మధు యాష్కీతో కలిసి ఢిల్లీ వెళ్ళడంతో కాంగ్రెస్ లో చేరనున్నారనే ప్రచారాన్ని ఆయన అనుచరులు ఖండించారు. వీరేందర్ గౌడ్ పార్టీ మారడం లేదని.. ఆయన బీజేపీలోనే కొనసాగుతారని స్పష్టం చేస్తున్నారు. కొంతమంది గిట్టని వ్యక్తులు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
Also Read : త్వరలో నలుగురు మాజీ ఎంపీలు , ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి -సీక్రెట్ భేటీ అందుకే..?