టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి సంక్రాంతితో ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు ఉంది. సంక్రాంతి వస్తే చాలు బ్యాట్ తో వీరవిహారం చేస్తాడు. ప్రత్యర్ధి టీం బౌలర్లు ప్రపంచ స్థాయి బౌలర్లైనా ఉతికిఆరేయడం పనిగా పెట్టుకుంటున్నాడు.
తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన విధ్వంసకరమైన ఆట తీరును అభిమానులకు పరిచయం చేశాడు.. 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 పరుగులు చేశాడు.. తన అసాధారణ బ్యాటింగ్ తో అభిమానులకు సంక్రాంతి సంబరాలను డబుల్ చేశాడు..
2017లో
2017లో సంక్రాంతి రోజే ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ… 2018 సంక్రాంతికి సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ మ్యాచ్ లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. 2019లో సంక్రాంతి సందర్భంగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో 112 బంతుల్లో 104 పరుగులు చేశాడు.
ఇక 2020 నుంచి 2022 వరకు విరాట్ కోహ్లీ తన కెరీర్లో పేలవ ఫాంతో నిరాశపరిచాడు. ఈ రెండేళ్ళలో ఒక్క సెంచరీ చేసింది లేదు. రెండు అంకెల స్కోర్ చేస్తే అదే గగనం అన్నట్లుగా విరాట్ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించిన పరిస్థితి. దీంతో అతడిని జట్టులో ఉంచడం దండగ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాధి అభిమానుల్లో పండగ జోష్ నింపాడు.