మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ పార్టీకి 25కోట్లు బీఆర్ఎస్ ఇచ్చిందని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. దీనిపై రేవంత్ రెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కు తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేస్తావా అంటూ ఈటలకు సవాల్ విసిరారు. దీంతో రేవంత్ – ఈటల మధ్య రాజకీయం సెగలు కక్కుతుండగా ఇందులోకి విజయశాంతి ఎంటర్ అయింది. ఇద్దరి నేతలను తమ్ముళ్ళని పేర్కొంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా బీఆర్ఎస్ పై యుద్ధం చేయాలని రేవంత్ అండ్ ఈటలకు విజయశాంతి సలహా ఇచ్చారు. తెలంగాణలోని దుర్మార్గ వ్యవస్థపై పోరాడవలసిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉన్నదని… కానీ ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే బీఆర్ఎస్ కే మేలు జరుగుతుందన్నారు. తమ దాడిని ఒకరిపై ఒకరు కాకుండా ఎవరి పంథాలో వారు సర్కార్ పై పోరాడం అవసరమని.. ఇందుకోసం ఆలోచించాలని రాములమ్మ సలహా ఇచ్చారు. ఇలా చెప్పడం తన భాద్యత అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు.
విజయశాంతి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం అవుతుండగా.. డీకే అరుణ మాత్రం ఈటల తరహాలోనే స్పందించింది. రేవంత్ రెడ్డి ఇష్యూలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతోందని వ్యాఖ్యానించారు. అసలు రేవంత్ ఇష్యూలో బీఆర్ఎస్ వత్తాసు ఎప్పుడు పలికిందో డీకే అరుణకే తెలియాలి. రాజకీయ నేతగా సుదీర్ఘ అనుభవమున్న డీకే అరుణ మాత్రం రేవంత్, కాంగ్రెస్ టార్గెట్ గా ఆరోపణలు చేయగా… రాములమ్మ మాత్రం బీఆర్ఎస్ టార్గెట్ గా సూచనలు చేయడం విశేషం.
బీఆరెస్‌తో పోరాడే తమ్ముళ్లు @revanth_anumula గారు, @Eatala_Rajender
గారు తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో… ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ…— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 22, 2023