“లైగర్” సినిమా నిర్మాణానికి విదేశాల నుంచి పెట్టుబడులు అందాయన్న ఫిర్యాదు మేరకు ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి లైగర్ దర్శకుడు పూరి జగన్నాథ్ , నిర్మాత ఛార్మిలను ఇప్పటికే విచారించిన ఈడీ తాజాగా హీరో విజయ్ దేవరకొండను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
లైగర్ సినిమా నిర్మాణంలో నిబంధనలకు విరుద్దంగా విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ సాగిస్తోంది. దుబాయ్ కి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారాయన.
లైగర్ సినిమా పెట్టుబడులకు సంబందించి హీరో విజయ్ దేవరకొండకు నోటిసులు ఇష్యూ చేసిన ఈడీ అధికారులు.. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేమయందని ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ రెమ్యునరేషన్ తోపాటు సినిమాలో ఇంకెవరైనా పెట్టుబడులు పెట్టారా అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.