విడదల రజిని. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టె యోచనలో ఉన్నారామె. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమా నిర్మాణ రంగంలో విజయవంతమైన వారు బోలెడు మంది ఉన్నారు. ఇప్పుడు వారి జాబితాలో విడదల రజిని కూడా చేరబోతున్నారు.
కాకపోతే..ఆమె రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దాల కాలం కూడా కాలేదు. అప్పుడు సైడ్ బిజినెస్ లు చేస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 2014లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసింది. నాటి చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యేను తన రాజకీయ గురువు అని చెప్పింది. పార్టీలో యాక్టివ్ గా పని చేసింది. సోషల్ మీడియా ద్వారా భారీ హైప్ క్రియేట్ చేసుకుంది.
2018లో వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని కబురు వచ్చింది. దాంతో టీడీపీకి గుడ్ బై చెప్పేసి విడదల రజిని వైసీపీలో చేరిపోయింది. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. గతేడాది మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆమెకు మంత్రి పదవి కూడా వరించింది.
అయితే ఇప్పుడు ఆమెకు సినిమా రంగంపై ఆసక్తి ఏర్పడింది. నిర్మాతగా సినిమాలు తీయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హైదరాబాద్ లో ఆఫీస్ కూడా తీసుకున్నారు. మొదట సినిమాకి కథ కూడా రెడీ అయ్యిందని సమాచారం. ఇప్పుడు ఆమె నిర్మించబోయే సినిమాలో దర్శకుడు, హీరో, హీరోయిన్స్ ఎవరనేది తెలియాల్సి ఉంది.