గోపీచందు మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ ల జోడీగా తెరకెక్కిన “వీర సింహ రెడ్డి ” సంక్రాంతి కానుకగా గురువారం విడుదలైంది. ఈ సినిమాలో బాలయ్య అదిరిపోయే స్టెప్పులతోపాటు స్ట్రాంగ్ డైలాగుల కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
కథ :
బాలసింహా రెడ్డి (బాలకృష్ణ ) ఫారిన్ లో ఒక బ్యాంకు మ్యానేజర్ గా పనిచేస్తుంటాడు. అతని సహుద్యోగి శృతి హాసన్ ఉంటుంది. బాలకృష్ణ తండ్రి వీర సింహా రెడ్డి (రెండో బాలకృష్ణ) ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్. సీమలో శాంతికి విఘాతం కలిగితే అసలు సహించడు. సీమలో ఎవరిని కత్తి పట్టకుండా ఉండేందుకు తానూ కత్తి పడుతాడు. విలన్స్ చేసే ప్రతీ దుశ్చర్యలను నాశనం చేస్తూ వాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. ప్రతీ విషయంకి అడ్డు వస్తున్నాడని విలన్ వీర సింహా రెడ్డి కి వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు.ఇదంతా తన తల్లి ద్వారా తెలుసుకున్న బాల సింహా రెడ్డి సీమకి వచ్చి విలన్ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇదే వీరసింహ రెడ్డి కథాంశం.
విశ్లేషణ :
ఈ సినిమాను చూస్తుంటే బాలయ్య గత సినిమాలు గుర్తుకు వస్తాయి. పాత కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు అనేలా ఉంది వీరసింహ రెడ్డి కథ. దాదాపు ఇదే స్టొరీతో గతంలో వచ్చిన ‘సింహా’లెజెండ్’మరియు‘అఖండ’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విస్ఫోటనాయాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలలో కథ మామూలే..కేవలం స్క్రీన్ ప్లే మీద శ్రద్ధ పెట్టి బాలయ్య ని అద్భుతంగా చూపించాడు దర్శకుడు..ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. బోయపాటి చేసిన ప్రయోగాన్ని ఈ సినిమాలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని చేసాడు. బాలయ్య ని ఎంత పవర్ ఫుల్ చూపిస్తే అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతారో అంత పవర్ ఫుల్ గా చూపించాడు..స్క్రీన్ మీద బాలయ్య ని చూస్తున్నంతసేపు సింహాన్ని చూస్తున్నట్టే ఉంటుంది.
భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చే వాళ్లకు ఈ సినిమా యావరేజిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చకపోవచ్చు. మితిమీరిన వయోలెన్స్ అందుకు కారణం. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కూడా అద్భుతంగా నటించాడు ..ఈ సినిమా తర్వాత ఆయనకీ టాలీవుడ్ లో ఫేమస్ విలన్ గా ఎదిగే అవకాశం ఉంది..ఇక ఇందులో బాలయ్య బాబు కి చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది..రెండు డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది..ఇక ఈ సినిమా లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఆయువు పట్టు అదే. సినిమా చూసి బయటకి వచ్చిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేము.
చివరి మాట : బాలయ్యలో కొత్తదనం కోరుకునే వారికీ ఈ సినిమా అంతగా నచ్చదు.
రేటింగ్ : 2. 5/5