ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆయా శాఖలకు కేటాయింపులు, ఆర్ధిక వృద్దిపై ప్రసంగించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం నుంచి 7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ కు రూపకల్పన చేశామన్నారు. తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపయిందని, ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందన్నారు.
బడ్జెట్ లోని ఆయా రంగాలకు కేటాయింపులు – ముఖ్యాంశాలు ఇవీ
వ్యవసాయ రుణాల కోసం రూ.20 లక్షల కోట్లు
శ్రీ అన్నపథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం
పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత
గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు
వ్యవసాయ స్టార్టప్ ల ప్రోత్సాహనికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు
వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులను సేంద్రియ సేద్యం వైపు మళ్లింపు
రైతుల కోసం 10 వేల బయో ఇన్ పుట్ రిసోర్స్ కేంద్రాల ఏర్పాటు
దేశంలోని 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్
పరపతి సంఘాల డిజిటలైజేషన్ కు రూ.2 వేల కోట్లు
ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం
సికిల్ సెల్ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక తోడ్పాటు
నేషనల్ డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు ప్రోత్సాహం
గిరిజనుల కోసం పీవీటీజీ పథకం ఏర్పాటు
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు
రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు
2013-14తో పోల్చితే రైల్వేలకు 9 రెట్లు అధికంగా నిధులు
కీలకమైన 100 మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు
ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం
పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు
5జీ సేవల యాప్ ల అభివృద్ధి కోసం 100 పరిశోధనా సంస్థలు
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు
ఎంఎస్ఎంఈలు, ఎన్జీవోలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరణ
కాలం చెల్లిన వాహనాల తొలగింపునకు తక్షణ ప్రాధాన్యత
కేంద్ర ప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు
కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు కూడా సాయం
నీతి ఆయోగ్ మరో మూడేళ్ల పాటు పొడిగింపు
పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ఏటా రూ.10 వేల కోట్లు
*2023 బడ్జెట్లో ఏడు ప్రాధాన్యతలు ఉన్నాయి మరియు అవి ఇన్ఫ్రా, గ్రీన్ గ్రోత్, ఫైనాన్షియల్ సెక్టార్, యువశక్తి.
*ప్రస్తుత సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి 7.0%గా అంచనా వేయబడింది, మహమ్మారి మరియు యుద్ధం కారణంగా సంభవించిన భారీ ప్రపంచ మందగమనం ఉన్నప్పటికీ, ఇది అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అత్యధికం.
*రైల్వేకు రూ.2.40 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించారు.
*రాష్ట్రాలకు వడ్డీ లేకుండా అందించేందుకు రూ.13.7 లక్షల కోట్లు కేటాయించారు.
*తలసరి ఆదాయం రెండింతలు పెరిగి రూ.1.97 లక్షలకు చేరుకుంది.
*ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నారు
*కరువు పీడిత మధ్య కర్ణాటక ప్రాంతానికి రూ.5,300 కోట్ల సాయం.
* గత 9 సంవత్సరాలలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 10వ స్థానం నుండి 5వ స్థానంలో ఉంది.
*పశుపోషణ, డెయిరీ, మత్స్య రంగాలపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచనున్నారు.
*కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ బడ్జెట్ లో హైలెట్ ఏంటంటే…మూడు నెలల్లో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏ రాష్ట్రానికి కేటాయించని విధంగా కర్ణాటకకు 5300 కోట్ల సాయం ప్రకటించింది. ఇది ఎన్నికల స్టంట్ గా అభివర్ణించవచ్చు.