వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా ఒటేసిందని తాటికొండలో ఆమె కార్యాలయంపై కొంతమంది దాడి కూడా చేశారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేసుకొని విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. గతంలో జగన్ కు మద్దతుగా మాట్లాడిన వీడియోస్ , ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోస్ ను సర్క్యూలెట్ చేస్తు మహానటి అంటూ పేర్కొంటున్నారు. నాడు ఆమె అమరావతి రైతు ఉద్యమం బోగస్ అని మాట్లాడిన వీడియోస్ ఇప్పుడు అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న వీడియోస్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.
ఈ క్రమంలోనే వైసీపీ సానుభూతిపరురాలు , టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎమ్మెల్యే శ్రీదేవికి సంబంధించిన ఆడియోను బయటపెట్టారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఎమ్మెల్యే ఏమన్నారు..? ఎవరితో మాట్లాడారు ఈ కథనంలో తెలుసుకుందాం.
తుళ్ళూరు ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తోన్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఇసుక వ్యాపారులు ఎమ్మెల్యేకు సన్నిహుతులు కావడంతో వారు ఆమె దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళారు. వెంటనే తుళ్ళూరు సీఐకి ఎమ్మెల్యే శ్రీదేవి ఫోన్ చేశారు. మీరు పట్టుకున్న వాహనాలను వెంటనే పీఎస్ నుంచి వెనక్కి పంపించాలని ఎమ్మెల్యే ఆదేశించింది. అయినా సీఐ వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చెప్తుంటే చెవికెక్కడం లేదా అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యే మాట అంటే అంత లోకువా అంటూ అప్పట్లో సిఐతో శ్రీదేవి మాట్లాడిన ఆడియో క్లిప్ తాజాగా ఆమె పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది.
ఇసుకను తరలిస్తూ పట్టుబడిన వాహనాలను విడిచిపెట్టాలని సీఐను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆయన కూడా విడిచిపెడతానని చెప్పి విడిచిపెట్టకపోవడంతో ఎమ్మెల్యే మరోసారి సీఐకి ఫోన్ చేశారు. ఏం తమాషాగా ఉందా..? అంటూ సిఐపై సీరియస్ అయ్యారు శ్రీదేవి. ఆ వాహనాలను విడిచిపెట్టమంటే ఎందుకు విడిచిపెట్టలేదు..?వదిలిపెడతానని ఎందుకు వదల్లేదు..?అని సీఐని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అంతా నీ ఇష్టమేనా. నువ్వేం చెప్పావ్ నువ్వేం చేస్తున్నావ్ అంటూ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ చెప్పిన మాటలను ఆమె ఏ మాత్రం వినకుండా సీఐకు హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే అంటే గౌరవం లేదా ఇప్పుడు వదిలేసి నెక్స్ట్ పట్టుకోమని చెప్పానా’ అని మరోసారి హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సిఐ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ. నాన్సెన్స్ నువ్వు వదులుతావా లేదా చెప్పు. జిల్లా ఎస్పీతో ఫోన్ చేయించుకుంటా. ఏం తమాషాగా ఉందా. ఎమ్మెల్యేని పట్టుకుని కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నవ్ అంటూ ఆగ్రహంతో శ్రీదేవి ఊగిపోయారు.
తుళ్ళూరు సీఐగా రావడానికి నా కాళ్ళు పట్టుకున్న సంగతి గుర్తులేదా..? కాళ్ళు పట్టుకొని పోస్టింగ్ తీసుకున్నావ్ అది గుర్తుంచుకో. అంటూ సీఐని హెచ్చరించింది. ఇప్పుడు ఆ వాహనాలను వదిలేస్తావా..? లేదా..? అసలు నువ్వేంటి..? నీ పోస్టు అంటి..? అంటూ సీరియస్ అయింది. నా దగ్గర ఎక్స్ట్రాలు చేయకు. ఫస్ట్ వాళ్ళను పంపించు లేదంటే డీజీపీకి కాల్ చేస్తా అంటూ సీఐపై విరుచుకుపడ్డారు శ్రీదేవి. ఈ ఆడియోను తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. అబ్బా కసి కసి గా మత్తు గా మాట్లాడే మన కస్సక్ పేకాటఆంటీ “శ్రీదేవి” కి ఎంత పొగరో ..ఈ తాజా తాజా 2nd వాయిస్ రికార్డు వినండయ్యా అంటూ రాసి ఈ ఆడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.
Also Read : జగన్ కు ఉండవల్లి శ్రీదేవి రిటర్న్ గిఫ్ట్ – ఏంటో తెలుసా..?
https://fb.watch/jyhe3O3AT6/