ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉండవల్లి శ్రీదేవి తన కూతురుని దీవించామని సి ఎం జగన్ ఇంటికి వెళ్లారు. ఇది ఒక కుంటిసాకు. ఆమెకు దళిత మహిళా కోటాలో మంత్రి పదవి ఇస్తానని జగన్ పలుమార్లు మాటిచ్చారు. ఆమెకే కాదు, ప్రతి ఏమ్మేల్లెకు ఇలాంటి హామీలు ఇవ్వడం సర్వసాధారణం. మేకపాటి చంద్రశేఖర్, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి కి కూడా మంత్రి పదవి ఇస్తానని ‘నిర్మ వాషింగ్ పౌడర్ వ్యాపార ప్రకటంలా’ పలుమార్లు జగన్ మాటిచ్చి తప్పించుకున్నారు జగన్. ఇది కూడా సర్వసాధారణం.
అంతేకానీ మంత్రి పదవి కోరినవాళ్లను ”నీకు పదవి ఇవ్వను. ఏం చేసుకుంటావాలో చేసుకో. మరోసారి బిచ్చగడ్డిలా మంత్రి పదవి అడిగి చావుకు. మరోసారి అడిగితే కాళ్లు విరిచేస్తా నాయాల్ది. వెళ్ళు” అని ఏ సిఎం కూడా కఠువుగా తిట్టి మెడబట్టి గెంటేయడుగా. అందరికి ఆశలు కల్పించి, తమ పని చేసుకుంటూ స్మూత్ గా గుండు గీస్తూ సాగిపోతుంటారు. ఇదే రాజకీయ ఫిలాసఫీ.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఈ నల్గురు ఎమ్మెల్లేలు ఎప్పటిలా తమ మంత్రి పదవుల గురించి జగన్ని గట్టిగానే అడిగారు. ఆయన ఎప్పటిలా ”చూద్దాం. ముందు ఈ ఎన్నికలు జరిగిపోనివండి” అని దాటివేత ధోరణి ప్రదర్శించారు. కానీ ఈసారి నలుగురు గట్టిగానే ఎప్పుడు ఇస్తారు అని నిలదీశారు.
ఇలా నిలదీస్తే ఏ సిఎం కైనా ‘డైపర్’లో మండుతుంది. నిన్నటివరకు కాళ్ళు మొక్కి, చేతులు పట్టుకుని బతిమాలి గొంతులు ఒక్కసారిగా బెదిరిస్తే సహించరు. అందుకే వాళ్లతో కఠువుగా ”ఇప్పట్లో ఇవ్వలేను. మీ కంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు గొడవ చేస్తారు. కాబట్టి వచ్చేసారి చూద్దాం” అని లేని చిరునవ్వురితో మందలించాడు జగన్.
ఇక జీవితంలో మంత్రి పదవులు రావని తెలిసిపోయింది. ఈసారి పార్టీ టికెట్ వచ్చే ఆశకూడా లేదు. ఆ నలుగురి నియోగకవర్గాలల్లో ‘బి’ గ్రేడ్ నాయకులతో జగన్ సంప్రదింపులు జరుపుతున్నారు అని తెలిసింది. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్లు ఈసారి తెలుగు దేశం వైపు పవనాలు వీస్తున్నాయి.
అందుకే క్రాస్ ఓటింది చేయాలి అనుకుని తెలుగుదేశంతో ముందుగా చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. జగన్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో సరిగ్గా అక్కడే కొట్టారు. ఎప్పుడు కొట్టాలో సరిగ్గా అప్పుడే కొట్టారు అని పుకారులు పుడుతున్నాయి.
ఓటింగ్ కి ముందు ఉండవల్లి శ్రీదేవి తాడో పేడో తేల్చుకోడానికి జగన్ని స్వయంగా కలిశారు. దళిత మహిళగా తనకు ఎదో ఓక పదవి ఇవ్వాలని ఆమె గట్టిగా డిమాండ్ చేసినట్లు తెలిసింది. కానీ జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. అందుకే ఆమె చాలా తెలివిగా తన నిరసన తెలిపారు. ఎన్నికలల్లో తెలుగుదేశం పార్టీ అనురాధ ఎమ్మెల్సీ గా గెలిచేలా చేశారు. ఆ విషయం బయటికి పొక్కదు అనుకున్నారు.
కానీ తెలుగుదేశం గెలవగానే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి వెంటనే అడ్డంగా దొరికారు. కానీ ఉండవల్లి శ్రీదేవి దొరకలేదు. జగన్ తనకు అన్నయ్యలాంటి వాడు అని ఆమె ఇప్పుడు భయపడి పైకి చెపుతున్నా లోపల ఉన్న రాజకీయం గురించి అందరికి తెలిసిపోయింది.
మరో క్రాస్ ఓటింగ్ కు పాలుపడిన వాళ్లలో మేకపాటి చంద్రశేఖర్ కూడా ఉన్నారు అని అందరు బాహాటంగానే చెప్పుకుంటూన్నారు. ఆయన కనీసం ఈ ఆరోపణను ఖండించకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. సెల్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. చివరికి జగన్ ఫోన్ చేసినా ఇదే పరిస్థితి. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజుకూడా అతను హాజరు కాలేదు. కాబట్టి ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ మీదే అందరి అనుమానాలు బలపడుతున్నాయి.