రాజకీయం రంగును మతాలకు పులిమిన ఘనత బిజెపికి దక్కుతుంది. దీనిని మొదలు పెట్టిన ఘనగా కూడా ఆ పార్టీకే దక్కుతుంది. అది పుణ్యమో? పాపామో వాళ్ళకే తెలియాలి. కానీ ఆ మతరాజకీయాన్ని మతంతోనే ఎదురుకోవాలని అటు బిఅరేస్ ఇటు వైసిపి బలంగా నమ్మి చాలా తెలివిగా మసులుకుంటున్నాయి.
బిజెపి అన్ని పనులు చేసింది ఒకఎత్తు, రామజన్మ భూమి వివాదాన్ని పరిష్కరించింది మరోఎత్తు. రామజన్మ భూమి వలన బిజెపి ఉత్తర భారత దేశంలో ఒక్కసారిగా హిమాలయం లాగా ఎదిగింది పాతుకుపోయింది. దాని ధాటికి కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ, మిగతా ప్రాంతీయ పార్టీలు విలవిలలాడుతున్నాయి.
దీనిని సరిగ్గా అర్థం చేసుకున్న కెసిఆర్ ఆ వేవ్ ని తెలంగాణాలో తగ్గించాలని రాముడి మీద దృష్టి పెట్టడంలేదు. నిజానికి కెసిఆర్ ని మించిన హిందూ భక్తుడు రాజకీయంలో మరొకరు లేరు. మోడీ కంటే పరమ భక్తుడు. కానీ ఇక్కడ రాజకీయం వేరు. మతం వేరు. తీర్థం తీర్థమే – ప్రసాదం ప్రసాదమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటినుంచి ప్రతి ముఖ్యమంత్రి శ్రీరామ నవమికి భధ్రాచలం వెళ్లి రాముడి కళ్యాణం చూడడం తప్పనిసరి ఆచారం. తమతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చేవారు. ఆ మాటకొస్తే సిఎం దగ్గరుండి ఆ పెళ్లి జర్పిస్తారు.
తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాలను కెసిఆర్ పక్కన పెట్టారు. కావాలని శ్రీరామ నవమికి భధ్రాచలం రాముడి పెళ్ళికి వెళ్ళకుండా డుమ్మా కొడుతున్నారు. దీనికి కారణం రాముడంటే బిజెపి అనే పుకారు తెలుగు రాష్ట్రలల్లో బలంగా పాతుకుపోయింది. రాముడి గుడికి వెళ్ళడం అంటే పరోక్షంగా బిజెపి జెండాను మోయడమే అనే అర్థం వస్తోంది.
అందుకే అయన కావాలని రాముడి నినాదానికి దీటుగా యాదగిరి గుట్టను నమ్ముకుని బిజెపి పాపులారితిని తెలంగాణాలో తగ్గిస్తున్నారు. ఆ మాటకొస్తే తెలంగాణ ప్రజలు ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనే ప్రచారం మొదలు పెట్టారు. రాముడైనా, లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ కృష్ణుడు అందరు బిలువు బొట్టు దేవుళ్ళే. అందరు ఒక్కటే కదా. ఏ దేవుడికి పూజ చేసిన విష్ణుకి మొక్కినట్లే కదా. అదే దీమతో రాముడు పెళ్ళికి కెసిఆర్ ప్రతి ఏడాది డుమ్మాల మీద డుమ్మాలు కొడుతున్నారు. బిజెపిని ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతున్నారు.
దీనిని ఇప్పడు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా అమలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాంతంలో భద్రాచలం ఉండటంతో ఏపీకి సంబంధించి ఒంటిమిట్ట రామాలయ కల్యాణానికి ఏపీ ముఖ్యమంత్రి వెళ్లే సంప్రదాయాన్ని మొదలు పెట్టారు.
దీనిని ఇప్పుడు జగన్ కూడా పక్కన పెట్టారు. మొన్న జరిగిని సీతారాముల కళ్యాణ వేడుకకు కాలు నొప్పి ఉన్నదని ఓ కుంటిసాకు చెప్పి తప్పించుకున్నారు. కానీ చిలకలూరి పేట లో ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపక్షలనుంచి, సొంత పార్టీ నుంచి అనేక విమర్శలు ఎదురుకుంటున్నారు. అయినా పెద్దగ పట్టించుకోవడం లేదు.
ఈ మధ్య జగన్ మతాన్ని పక్కనపెట్టి ఏడుకొండలు ఎక్కి పట్టు వస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. మరి రాములోరి పెళ్ళికి ఎందుకు హాజరు కాలేదు? వెరి సింపుల్. రాముడి నుంచి తప్పించుకుంటే బిజెపి నుంచి తప్పించుకున్నట్లే అనుకున్నారు. రాజకీయం దేనిని వదలదు అనడానికి ఇదో చక్కటి ఉదాహరణ.